»   » బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ మీద కన్నేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మేకర్స్

బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ మీద కన్నేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మేకర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2017 సంవత్సరం ప్రభాస్ కెరీర్లోనే ఓ గొప్ప సంవత్సరం కాబోతోందా? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. బాహుబలి ప్రాజెక్టు కోసం నాలుగు సంవత్సరాల పాటు కమిట్మెంటుతో, డెడికేషన్ తో పని చేసిన ప్రభాస్ ఇపుడు ఇంటర్నేషనల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అవ్వడమే ఈ చర్చకు కారణం.

అమెరికన్ పాపులర్ డ్రామా సిరీస్.... 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మేకర్స్ ప్రభాస్ డెడికేషన్ చూసి ముగ్దులయ్యారని, అతడిపై ప్రశంసలు గుప్పించారని తెలుస్తోంది. దర్శకుడి కల తెరపై నిజం కావాలంటే ప్రభాస్ మాదిరిగా డెడికేషన్ తో, కమిట్మెంటుతో పని చేసే యాక్టర్లు కావాలని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు అంటున్నారు.


ఇంటర్నేషనల్ హీరో

ఇంటర్నేషనల్ హీరో

బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగు సినిమా పరిధి దాటి, ఇండియన్ సినిమా బోర్డర్ క్రాస్ చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంపై అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


హాలీవుడ్లో అవకాశాలు?

హాలీవుడ్లో అవకాశాలు?

ప్రభాస్ ఇపుడు ఇంటర్నేషనల్ సర్య్కూట్ లో హాట్ టాపిక కావడంతో అతడినికి హాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే నిజం అయితే ప్రభాస్ రేంజే మారిపోనుంది.


ఇండియాలో చాలా అరుదు

ఇండియాలో చాలా అరుదు

ఇండియన్ సినీ చరిత్రలో ఒక సినిమా కోసం, అందులోని పాత్ర కోసం ఇన్నేళ్లు తన కెరీర్ పనంగా పెట్టడం చాలా అరుదు. హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమాల నటులు మాత్రమే ఇలా చేస్తుంటారు. ఇపుడు ఇండియా నుండి ప్రభాస్ అలాంటి ఫీట్ చేయడంతో ఇంటర్నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది.


వెయ్యి కోట్ల హీరోగా?

వెయ్యి కోట్ల హీరోగా?

ఈ నెల 28న విడుదల కాబోతున్న ‘బాహుబలి-ది కంక్లూజన్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన బాహుబలి పార్ట్ 1 భారీ విజయం సాధించి రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 బాక్సాపీసు వద్ద రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 1000 కోట్లు సాధించిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డులకెక్కబోతున్నారు.


English summary
The makers of the popular American Drama series, Game of Thrones are extremely impressed with Baahubali Prabhas and are all praises for the actor, according to a source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu