»   »  మాటల్లో చెప్పలేను: బాహుబలి గురించి రామ్ చరణ్ ఇలా..

మాటల్లో చెప్పలేను: బాహుబలి గురించి రామ్ చరణ్ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర' చిత్రంతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' చిత్రాన్ని వీక్షించాడు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు.

శుక్రారం రాత్రి ‘బాహుబలి' సినిమా చూసిన అనంతరం రామ్ చరణ్ స్పందిస్తూ... ఇపుడు ‘బాహుబలి' సినిమా చూసాను. మాటల్లో చెప్పలేను. రాజమౌళికి, విజయేంద్రప్రసాద్ గారికి, భోభు, సెంథిల్ కుమార్ మరియు టీం మెంబర్స్ అందరికీ హాట్స్ ఆఫ్. ప్రభాస్, రానా, రమ్య గారు సూపర్ గా నటించారు. బాహుబలి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అని వ్యాఖ్యానించారు. బాహుబలి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ సూపర్. కీరవాణి సార్ కి స్పెషల్ కంగ్రాట్స్ అని వెల్లడించారు.


అదే విధంగా ఈరోజు ఈద్ పండగను పురస్కరించుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసారు రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో చెర్రీ స్టంట్ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్రలో తమిళ నటుడు అరుణ్ విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Baahubali leaves Ram Charan speechless

సినిమాలో తన పాత్ర కోసం రామ్ చరణ్ థాయ్లాండ్ వెళ్లి కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ‘బ్రూస్ లీ' అనే మరో టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కథ ప్రకారం ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ' అనే టైటిలే బెటరని, అదే ఫిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడనుంది.


సినిమాలో కూడా రామ్ చరణ్ బ్రూస్ లీ టాటూతో కనిపించబోతున్నారని అంటున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని, గతంలో ఏ తెలుగు సినిమాలోనూ లేని విధంగా సూపర్బ్ అనిపించే విధంగా స్టంట్స్ మనం ఈచిత్రంలో చూడబోతున్నామని టాక్.


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించని షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ చాలా బాగా వచ్చిందని, దర్శకుడు శ్రీను వైట్ల, రైటర్ గోపీ మోహన్ ఔట్ పుట్ మీద చాలా హ్యాపీగా ఉన్నారని, ముఖ్యంగా రామ్ చరణ్ కామిక్ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టకుంటుందని అంటున్నారు.

English summary
"Just saw Baahubali..came out Speechless.Hats off to our Epic maker Rajamouli,Vijender prasad Garu Shobu,Senthil kumar &the whole team for creating this spectacular.Prabas,Rana,Ramya Garu &other entire cast have enhanced the whole experience to another level.cant wait for part2" Ram Charan said.
Please Wait while comments are loading...