»   » పబ్లిసిటీ ట్రిక్స్: చైనాలో ల్యాండైన బాహుబలి టీం (ఫోటోలు)

పబ్లిసిటీ ట్రిక్స్: చైనాలో ల్యాండైన బాహుబలి టీం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియాలో భారీ విజయం సాధించిన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రానికి విదేశాల్లో ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయగా కొన్ని చోట్ల భారీ నష్టాలు మిగల్చగా...కొన్ని చోట్ల మాత్రం నామ మాత్రపు లాభాలు నమోదు చేసింది.

తాజాగా 'బాహుబలి' చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో ఈ సినిమాకు ఆశించిన ఆదరణ దక్కక పోయినా చైనాలో మాత్రం మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తోంది. ఇంతకు ముందు చైనాలో విడుదలైన ఇండియన్ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి.


'బాహుబలి' చిత్రాన్ని చైనాలో భారీగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.... ప్రచార కార్యక్రమాలు కూడా భారీగానే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా సినిమాలోని ప్రధాన తారాగణం, దర్శక నిర్మాతలు సినిమాను చైనాలో ప్రమోట్ చేయడానికి చైనా వెళ్లారు.


ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, కాస్టూమ్ డిజైనర్ రమారాజమౌళి తదితరులు చైనా వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.


100 కోట్లు టార్గెట్

100 కోట్లు టార్గెట్

చైనాలో బాహుబలి చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేయాలనే లక్ష్యంతో ఇక్కడ ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

చైనాలో బాహుబలిచిత్రాన్ని రికార్డు స్థాయిలో 5వేల స్క్రీన్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.


ఆదరణ

ఆదరణ

చైనాలో వార్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో బాహుబలి చిత్రానికి మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.


బాహుబలి-2

బాహుబలి-2

చైనా పర్యటన ముగిసిన అనంతరం చిత్ర యూనిట్ మల్లీ బాహుబలి-2 షూటింగులో జాయిన్ అవుతారు.


ఈ స్టార్ ఫిల్మ్

ఈ స్టార్ ఫిల్మ్

చైనాలో బాహుబలి చిత్రాన్ని ఈ స్టార్ ఫిల్మ్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.


English summary
Prabhas, Rana, Anushka, Tamannaah and SS Rajamouli visited China.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu