»   » రూ. 1000 కోట్ల కలెక్షన్.... బిగ్ హగ్ అంటూ ఎమోషనల్‌గా స్పందించిన ప్రభాస్!

రూ. 1000 కోట్ల కలెక్షన్.... బిగ్ హగ్ అంటూ ఎమోషనల్‌గా స్పందించిన ప్రభాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాహుబలి-2 మూవీ రూ. 1000 కోట్ల కలెక్షన్ మార్కును రీచ్ అవ్వడం ద్వారా ఇండియన్ సినీ రంగంలో సరికొత్త చరిత్ర మొదలైంది. రూ. 1000 కోట్ల మార్కును అందుకున్న విషయాన్ని బాహుబలి టీం కూడా సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది.

  ఈ సంతోష సమయంలో బాహుబలి స్టార్ ప్రభాస్ ఎమోషనల్‌గా స్పందించారు. 'నా ఫ్యాన్స్‌ అందరికీ...బిగ్ హగ్. నాపై మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. భారత్‌లో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ప్రేక్షకుల ఆదరణ పొందడానికి నా శక్తిమేర ప్రయత్నం నేను చేశాను. మీరు నాపై చూపించిన ఆదరణకు సంతోషంతో పొంగిపోతున్నాను అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.


  సుధీర్ఘ ప్రయాణం

  బాహుబలి చిత్రం ఓ సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరంతా నాతో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.... అని ప్రభాస్ ఆనందం వ్యక్తం చేసారు.


  జీవితంలో ఒకేసారి లభించే అవకాశం

  జీవితంలో ఒకేసారి లభించే అవకాశం

  బాహుబలి అనేఃది జీవితంలో ఒక్కసారి లభించే ఇలాంటి అవకాశం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన ఎస్‌.ఎస్‌ రాజమౌళికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అని ప్రభాస్ అన్నారు.


  అఫీషియల్ ప్రకటన

  బాహుబలి రూ. 1000 కోట్ల కలెక్షన్లను అఫీషియల్ గా ప్రకటించిన చిత్ర యూనిట్..... తాము పడ్డ కష్టానికి సపోర్టుగా నిలిచిన ప్రేక్షకలకు, ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.


  సంబరాల్లో చిత్ర యూనిట్

  సంబరాల్లో చిత్ర యూనిట్

  భారతీయ సినీ పరిశ్రమలో ‘బాహుబలి' మూవీ సరికొత్త చరిత్ర సృష్టించడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది.  English summary
  "To All My Fans , a big hug to each one of you for all the love that you'll have showered on me. I have tried my best to go through a lot of the efforts that you all have put to express your affection for me from different parts of India and even overseas. I am truly overwhelmed with everything. The journey of Baahubali has been a long one but among the few things that I will take away from this, is all of you. Lots of love back to you all. A big thank you to SS Rajamouli sir for believing in me to carry his huge vision to the masses, giving me a once-in-a-lifetime character of Baahubali and making the entire journey so special." Baahubali Prabhas posted in FB.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more