twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి 2 Vs అవెంజర్స్.. అవమానించేలా ట్వీట్.. బాలీవుడ్ క్రిటిక్‌పై శోభు యార్లగడ్డ ఫైర్!

    |

    బాహుబలి 2 చిత్రం భారత సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రముఖులకు కూడా షాకిచ్చేలా వసూళ్లు రాబట్టింది. ఇంత వరకు బాహుబలి చిత్రాన్ని తలదన్నే మరో ఇండియన్ సినిమా రాలేదు. ఇటీవల విడుదలైన హాలీవుడ్ బడా చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు కొల్లగొడుతోంది. హాలీవుడ్ చిత్రాల ప్రభావం తక్కువగా ఉండే ఇండియాలో కూడా ఈ మార్వెల్ మూవీ అదరగొడుతోంది. ఈ చిత్ర నార్త్ ఇండియా వసూళ్ళని తెలియజేస్తూ బాలీవుడ్ సీనియర్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ వివాదంగా మారుతోంది.

    దుమ్ము దులుపుతున్న అవెంజర్స్

    దుమ్ము దులుపుతున్న అవెంజర్స్

    పిల్లలకు, పెద్దలకు మార్వెల్ చిత్రాలు బాగా ఎక్కేశాయి. అందుకే ప్రాంతీయ భాషా చిత్రాల ప్రభావం ఎక్కువగా ఉండే ఇండియాలో కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ కళ్ళు చెదిరే వసూళ్ళని రాబడుతోంది. సూపర్ హీరోల విన్యాసాలతో విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తోంది. నార్త్ ఇండియాలో బాలీవుడ్ బడా చిత్రాల రికార్డులని అధికమిస్తూ అవెంజర్స్ ప్రభంజనం కొనసాగుతోంది.

    తొలివారం వసూళ్లు

    తొలివారం వసూళ్లు

    ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సాధించిన తొలి వారం వసూళ్ళని ట్వీట్ చేశాడు. ఈ వసూళ్ళని బాలీవుడ్ ఇతర చిత్రాలతో పోల్చుతూ ట్వీట్ చేశారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ వర్సెస్ బాలీవుడ్ బడా చిత్రాలు తొలివారం సాధించిన వసూళ్లు అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. అవెంజర్స్ చిత్రం తొలివారం ముగిసేసరికి 260 కోట్లు సాధించి టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి 2 నిలిచింది. బాహుబలి 2 తొలివారం 247 కోట్లు సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో సుల్తాన్ 229 కోట్లతో, టైగర్ జిందా హై 206 కోట్లతో నిలిచాయి.

    అవమానకరంగా

    అవమానకరంగా

    ఇలా తరుణ్ ఆదర్శ్ అవెంజర్స్ ని, ఇతర ఇండియన్ చిత్రాల్ని పోల్చుతూ ట్వీట్ చేయడం బాహుబలి నిర్మాతకు అవమానకరంగా అనిపించినట్లు ఉంది. దీనితో వెంటనే ఆయన్ని విమర్శిస్తూ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. శోభుయార్లగడ్డ ట్విట్టర్ లో.. మీరు పేర్కొన్న చిత్రాల్లో.. ఏ విజయాన్ని తక్కువ చేసి చూడలేం. ప్రతి చిత్రంలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీలాంటి సీనియర్ క్రిటిక్స్ ఇలా వసూళ్ళని పోల్చుతూ ఆ చిత్రాలు సాధించిన విజయాల్ని తక్కువ చేయడం సరికాదు అని శోభు పేర్కొన్నారు.

    బాహుబలి 2 హిందీలో మాత్రమే

    బాహుబలి 2 నార్త్ ఇండియాలో కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలై ఆ స్థాయి వసూళ్లు రాబట్టిందని శోభు పేర్కొన్నారు. మిగిలిన చిత్రాలన్నీ అన్ని భాషల్లో విడుదలయ్యాయి అని తెలిపారు. శోబు బాహుబలి నిర్మాతల్లో ఒకరు. 2017లో విడుదలైన బాహుబలి చిత్రం అప్పటివరకు ఉన్న ఇండియన్ సినిమాల రికార్డులు చెరిపివేస్తూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

    English summary
    Baahubali producer Shobu Yarlagadda fires on Bollywood critic Taran Adarsh. He is not happy over Taran Adarsh comparing Baahubali with Avengers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X