»   » ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ : ‘బాహుబలి’ చిత్రానికి ప్రీక్వెల్ ఈ నెల 20న

‘ది రైజ్ ఆఫ్ శివగామి’ : ‘బాహుబలి’ చిత్రానికి ప్రీక్వెల్ ఈ నెల 20న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' చిత్రానికి ప్రీక్వెల్ రాబోతోంది. అదేంటి సీక్వెల్ కదా వస్తోంది..ప్రీక్వెల్ అంటారేంటి అంటారా..అవును..ప్రీక్వెలే వస్తోంది. అయితే అది సినిమా రూపంలో కాదు పుస్తకాల రూపంలో. ఈ పుస్తకాల్నికేరళలోని కొచ్చికి చెందిన రచయిత ఆనంద్ నీలకంఠన్ రాస్తున్నారు.

ఓ ప్రక్కన ప్రపచం మొత్తం' బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? బాహుబలి సీక్వెల్ ఏమై ఉంటుంది..? పార్ట్ 2 లో అనుష్క పాత్ర ఎలా ఉంటుంది..?..'' అంటూ బాహుబలి సినిమా గురించిన అభిమానుల చర్చలతో కాలం గడుపుతున్నారు. జనాలు ఇంతలా చర్చించుకుంటున్నారంటే బాహుబలి సక్సెస్ ని మరో విధంగా కూడా క్యాష్ చేసుకోదలిచారు. బాహుబలి ఇప్పుడు స్క్రీన్ పైనే కాకుండా నవల హీరోగా కూడా రానున్నాడు.

Baahubali’s prequel to be released soon

రాజమౌళి బాహబలి - ది బిగినింగ్, బాహుబలి - ది కన్ క్లూజన్ అనే పేర్లతో సినిమాలు తీస్తే నీలకంఠన్ మాత్రం వాటి ముందు కథ అనే అర్థం వచ్చేట్టు బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్ పేరును తన పుస్తకాల సిరీస్ కు పెట్టి రాయటం మొదలెట్టారు.ఈ సిరీస్ లో భాగంగా మొదటి పుస్తకం 'ది రైజ్ ఆఫ్ శివగామి' ని సిద్ధం చేసి కవర్ ను ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు.

ఇండియాలోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన బాహుబలి సినిమాను పుస్తక రూపంలో తెస్తే మంచి బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక పురాణ పాత్రలైన రావణ, దుర్యోధనులపై నవలలు రాసి సక్సెస్ ఫుల్ గా మార్కెట్ చేసుకున్న నీలకంఠన్ ఈ నవలను రాస్తుండటంతో.. సాహితీలోకంలో నవలకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

Baahubali’s prequel to be released soon

అలాగే మిగిలిన రెండు పుస్తకాలు బాహుబలిలో బాగా హైలెట్ అయిన కట్టప్ప పాత్రకు సంబంధించినవిగా ఉండనున్నాయి. ముందుగా ఇంగ్లీషులో ఈ పుస్తకాల్ని రిలీజ్ చేసి తరువాత తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ పుస్తకాల రిలీజ్ ను ఏప్రిల్ 29 బాహుబలి - ది కన్ క్లూజన్ చిత్రం విడుదల తరువాత చేయనున్నారు. ఈ చిత్రం పై ఇది వరకే పలు కథల పుస్తకాలు, కామిక్ పుస్తకాలు, కంప్యూటర్ సంబంధిత గేమ్స్, ఆట వస్తువులు రూపొందిన సంగతి తెలిసిందే.

English summary
SS Rajamouli’s magnum opus Baahubali will soon get its prequel, The first part, The ‘Rise of Sivagami’ will be released on January 20th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu