»   » ముంబై లో బాహుబలి సెట్టింగ్స్ తొలగించారు: ఆ విషాదమే కారణం

ముంబై లో బాహుబలి సెట్టింగ్స్ తొలగించారు: ఆ విషాదమే కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో బాహుబలి ప్రీమియర్ల నిర్ణయం ఒక్క రోజు ముందే తీసుకున్నది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఎప్పటినుంచో భారీ ఎత్తున ప్రీమియర్లు వేయాలని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాడు నిర్మాత కరణ్ జోహార్. బాహుబలి రిలీజ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరణ్ ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలనుకున్నాడు.

బాలీవుడ్ విషాదం లో మునిగి పోయింది

బాలీవుడ్ విషాదం లో మునిగి పోయింది

ప్రీమియర్ వేయటానికి ఎంచుకున్న థియేటర్ ని పెళ్ళికూతురు లా అలంకరించారు కూడా. కానీ ఆఖరి నిమిషం లో బాలీవుడ్ విషాదం లో మునిగి పోయింది. బాలీవుడ్ దిగ్గజం వినోద్ ఖన్నా మృతితో అంచనాలన్నీ తారుమారయ్యాయి.... ఈ ఈవెంట్ కోసం ప్రీమియర్ ప్రదర్శించే ప్రాంతంలో భారీ సెట్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు.


సూపర్ స్టార్ వినోద్ ఖన్నా

సూపర్ స్టార్ వినోద్ ఖన్నా

అయితే.. అనుకోకుండా సీనియర్ నటుడు సూపర్ స్టార్ వినోద్ ఖన్నా మరణించారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆయన..నిన్న తుది శ్వాస విడిచారు. అంత విషాదం లో ఇలా అన్నందంతో వేడుకలు జరుపుకోవ్బటం ఎలా? అందుకే ఇక ఆ షో నే రద్దు చేస్తున్నట్టు ప్రకటించేసాడు కరణ్,


వినోద్ ఖన్నా మరణ విషాదం

వినోద్ ఖన్నా మరణ విషాదం

బాలీవుడ్ కి గాడ్ ఫాదర్ ల స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో ఒకడైన వినోద్ ఖన్నా మరణ విషాదం లో ఈ ఈవెంట్ ని ఆనందించలేమనీ, అందుకే ఆయన స్మృతిగానే ఇలా ప్రీమియర్ ను రద్దు చేస్తున్నామని వెల్లడించాడు. ఇక షో ఎటూ రద్దయ్యింది కానీ ఇంకో చిన్న భాద మాత్రం మిగిలి పోయింది.


మూడు రోజులు కష్టపడి

మూడు రోజులు కష్టపడి

బాలీవుడ్ లో ప్రీమియర్ వేసే ముంబయ్ ధియేటర్ దగ్గర బాహుబలి కటౌట్లు.., ఆర్టిస్టిక్ గా కనిపించే సెట్టింగులూ.. వంటివిచాలా పెట్టేశారు. అవన్నీ ప్రీమియర్ కి వచ్చే ఆహూతులకి గొప్పగా కనిపించటం కోసం వేసిన సెట్టింగులట. పాపం మూడు రోజులు కష్టపడి వేసిన ఆ సెట్టింగులనీ, కటౌట్లనీ ప్రీమియర్ రద్దవటం తో తొలగించాల్సి వచ్చింది.


తీసేసారు

తీసేసారు

ప్రీమియర్ కోసం వచ్చే సినీ ప్రముఖుల కోసం వేసిన సెట్టింగులని ఇవాళ్టినుంచీ వచ్చే సాధారణ ప్రేక్షకుడు చూడటం నచ్చలేదో, లేదంటే ఆ థియేటర్ యజమానికీ వినోద్ ఖన్నా మృతి తో ఏం చేయాలో తోచలేదో గానీ ఆ అలంకరణలన్నీ తీసేసారు.... పాపం మొత్తానికి ఎంతో కష్టపడి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోయాయి...English summary
The movie makers of Bahubali have announced the canceling the Premiere in Mumbai. As the mark of respect to Bollywood Veteran, Vinod Khanna who breathed his last this morning suffering from cancer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu