twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జపాన్‌లో 'బాహుబలి' : రైట్స్ ఎవరికీ అంటే

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం 'బాహుబలి' జపాన్‌ థియేటర్లలో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. జపాన్‌లో ఈ చిత్రం ప్రదర్శించేందుకు ట్విన్‌ కో అనే సంస్థ హక్కులు కొనుగోలు చేసినట్లు చిత్ర దర్శకుడు రాజమౌళి వెల్లడించారు.


    విడుదలైన తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన 'బాహుబలి' చైనాలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయ పరంపర కొనసాగిస్తూ.. జపాన్‌ మార్కెట్‌లోనూ విడుదల కావడం తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు ఆనందించదగ్గ విషయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

    దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఆదివారం ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో చిత్రాన్ని వీక్షించిన వారంతా చిత్ర దర్శకుడు రాజమౌళిని అడిగినవి రెండే ప్రశ్నలు ఒకటి పార్టు-2 ఎప్పుడు విడుదల చేస్తారు. రెండోది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని. అక్కడ లభించిన విశేష స్పందన పట్ల దర్శకుడు హర్షం వ్యక్తం చేశారు.

    దక్షిణకొరియాలోని బుసాన్‌లో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. 10రోజుల పాటు జరగనున్న ఈ ఫిలిం ఫెస్టివల్‌ ఆసియాలోని అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్‌. ఇందులో 75 దేశాలకు చెందిన 303 చిత్రాలను, 94 వరల్డ్‌ ప్రీమియర్స్‌ను ప్రదర్శిస్తారు.

    ఇందులో దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని మూడు రోజుల పాటు ప్రదర్శించారు. అక్టోబర్‌ 4, 7, 11 తేదీల్లో బాహుబలి చిత్రాన్ని ప్రదరించారు.

    రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ చిత్రం ఇప్పుడు బుల్లి తెరలను అలరించబోతోంది.

    మాటీవిలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 25, ఆదివారం సాయింత్రం 6 గంటలకు ప్రీమియర్ షో గా ప్రసారం చేయనున్నారు. ఓ రోజు ముందు అంటే అక్టోబర్ 24న సినిమా మేకింగ్ గురించి, ఇంటర్వూలు వగైరా రెండు గంటలుపాటు ప్రసారం చేస్తారు. బాహుబలి తో దసరా రేస్ లోకి మాటీవి ప్రవేశిస్తోంది.

    ముందుగా మళయాళంలో ఈ సోమవారం అంటే అక్టోబర్ 4న ఆదివారం సాయింత్రం ఆరు గంటలకు కేరళలో Mazhavil Manorama ఛానెల్ లో ప్రసారం కానుంది.

    bhahubali

    తర్వాత దసరా,దీపావళిలకు హిందీలో సోనీ మాక్స్, తెలుగులో మాటీవీ వారు ఈ సినిమాను ప్రసారం చేయనున్నారు. ఈ సినిమా ప్రసార సమయంలో టీఆర్పీలు చాలా బాగుంటాయని ఆశిస్తున్నారు. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తాలను పెట్టి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఛానెల్స్ వారు తీసుకోవటం జరిగింది.

    విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.

    తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

    English summary
    Twin Co., leading independent distributor officially acquires Japan rights for "Baahubali: The Beginning!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X