»   » ‘బాహుబలి’:నోటితో ఎక్కువ పబ్లిసిటీ

‘బాహుబలి’:నోటితో ఎక్కువ పబ్లిసిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన ప్రాతధారులుగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఇప్పటికే అనేక కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసిన ‘బాహుబలి' చిత్రం ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.

తాజాగా ఒర్‌మాక్స్‌ మీడియా అనే సంస్థ నిర్వహించిన ‘వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌' సర్వేలో బాహుబలి చిత్రం టాప్‌లో నిలిచింది. ఈ సర్వే అర్దం ఏమిటి అంటే.... ప్రేక్షకులు స్వయంగా ప్రచారం చేసిన సినిమాల్లో టాప్ ఏమిటి అన్నదాని గురించి . ఈ విషయాన్ని బాహుబలి టీమ్ తమ ట్వీట్ ద్వారా తెలియచేసింది.ఇలా సినిమా బాగుంది అంటూ తనకు తెలియకుండానే ప్రచారం చేసే ఈ సర్వేలో టాప్ గా నిలవటం అదీ ఇండియాలో గర్వకారణమే. ఇలా 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో ‘బాహుబలి' చిత్రాన్ని ఎక్కువగా ప్రచారం చేశారట. ఇక రెండో స్థానంలో సల్మాన్‌ఖాన్‌ బజరంగీ భాయిజాన్‌, మూడో స్థానంలో బాజీరావు మస్తానీ నిలవడం విశేషం


మిగతా ప్లేస్ లలో ..


4. అజయ్‌ దేవగణ్‌- దృశ్యం
5. కంగనా రనౌత్‌- తనువెడ్స్‌ మను రిటర్న్స్‌
6. అక్షయ్‌ కుమార్‌- బేబి
7. అమితాబ్‌బచ్చన్‌- పీకూ
8. తల్వార్‌
9. మాంఝీ
10. అక్షయ్‌ కుమార్‌- గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌


ఈ సర్వేలో ఈ చిత్రాలు మొదటి పది స్థానాల్లో నిలిచాయి. అలాగే వీటి వలన లాభం ఏమిటీ అంటే... పబ్లిసిటీ ఖర్చు తగ్గించుకోవచ్చు. తొలి వారం తర్వాత వచ్చే కలెక్షన్లు ఈ రకంగా జరిగే ప్రచారంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.


Baahubali tops Popular Survey leaving behind Hindi movies!

ఇక రీసెంట్ గా ఈ బాహుబలి చిత్రానికి ఐఫా ఉత్సవం పురస్కారాల్లో తమిళ భాషలో ఏడు పురస్కారాలు లభించాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో తమిళం, మళయాళం భాషల్లో ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు అందజేశారు.


చిత్రానికి తొలి ఐఫా ఉత్సవంలో లభించిన పురస్కారాలు


* ఉత్తమ చిత్రం
* ఉత్తమ దర్శకుడు
* ఉత్తమ సహాయ నటుడు
* ఉత్తమ సహాయ నటి
* ఉత్తమ నేపథ్య గాయని
* ఉత్తమ నేపథ్య గాయకుడు
* ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌


English summary
Baahubali movie has created another record by beating some super hit Hindi films of the last year. The survey was conducted by OreMax Media. The name of the survey is Word of Mouth’. The media organization has said that Bahubali had created a lot hype in the first week of its release. According to the organization, the collection of any movie in the first week would depend on word of mouth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu