twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2 వేల మందితో 2 నెలలు...రాజమౌళి రికార్డ్ ఫీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వేల మంది సైన్యంతో భారీ యుద్ధ సన్నివేశాలు, ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలతో కూడిన ఉత్కంఠ రేపే సీన్స్ ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలకే పరిమితం. హాలీవుడ్ వాళ్లకు మాత్రమే కాదు...మనకూ ఇలాంటి చేయడం సాధ్యమే అని నిరూపించబోతున్నారు దర్శకుడు రాజమౌళి.

    'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ మేరకు వారికి కత్తియుద్ధం, గుర్రపుస్వారీలో శిక్షణ ఇచ్చారు.

    పీటర్ హెయిన్స్ ఈ యుద్ద సన్నివేశాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్లో ప్రారంభం అయ్యే ఈ షూటింగ్ రెండు నెలల పాటు ఫిబ్రవరి నెల వరకు సాగుతుందని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. డిసెంబర్ 3న కేరళ షెడ్యూల్ పూర్తి కానుంది.

    ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నారు. కీరవాని సంగీతం అందిస్తుండగా, సాబుసిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. 2015లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Rajamouli and Baahubali team are going to create one of the best ever war sequences seen in Indian cinema. More than 2000 junior artists are going to take part in this war sequence and several members of the cast have undergone special training in horse riding and sword fighting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X