»   » రాజమౌళి వల్లే.. అవంతిక పాత్రను తొక్కెయ్యడంపై తమన్నా..

రాజమౌళి వల్లే.. అవంతిక పాత్రను తొక్కెయ్యడంపై తమన్నా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హలీవుడ్ సినిమాలను తలదన్నేలా రూపొందిన బాహుబలి చిత్రంలోని పాత్రలు దేనికవే సాటి. బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో అవంతిక పాత్రదే ప్రధాన భాగం. అవంతిక పాత్రను పోషించిన తమన్నా భాటియాకు మంచి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. బాహుబలి1 చిత్ర కథలో వీరనారిగా అవంతిక పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. బాహుబలి2 చిత్రంలో అవంతిక పాత్రకు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని అందరూ భావించారు. అయితే బాహుబలి2లో అవంతిక పాత్ర నామమాత్రంగానే ఉండటంపై అనేక ఊహాగానాలకు తావిచ్చింది. తన పాత్ర కుదింపుపై మీడియాలో చెలరేగుతున్న వార్తలపై తమన్నా ఇటీవల వివరణ ఇచ్చారు.

క్లైమాక్స్ అంతా నా మీదే..

క్లైమాక్స్ అంతా నా మీదే..

తమన్నా కూడా క్లైమాక్స్ అంతా తనపైనే ఉంటుంది. రెండో భాగం కోసం మరింతగా శ్రమించాను. కత్తిసాము కూడా నేర్చుకొన్నాను అని ప్రమోషన్‌లో వెల్లడించింది. అయితే బాహుబలి2లో ఆమె పాత్ర చిత్రీకరించిన విధానం, ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యం చాలా తక్కువ అని అర్థమైంది. అందుకు కారణం దర్శకుడు రాజమౌళితో గొడవ పడటమేనని వార్తలు విస్త్రృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ వార్తలపై తమన్నా స్పందించారు.


రాజమౌళి వల్లే

రాజమౌళి వల్లే

అవంతిక పాత్ర కుదింపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. నా పాత్ర, దాని ప్రాధాన్యం ఏంటో నాకు తెలుసు. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాను తీసిన రాజమౌళి సార్ అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి2 సినిమా నా జీవితంలో ఎంతో మార్పు తెచ్చింది. యాక్టర్‌గా, సినీ పరిశ్రమలో నాకు మంచి గుర్తింపును బాహుబలి ఇచ్చింది అని తమన్నా మీడియాతో అన్నారు.


ఆ అనుమానానికి కారణం..

ఆ అనుమానానికి కారణం..

నిజానికి బాహుబలి1 చిత్రంలో అవంతిక పాత్రదే అగ్రభాగమైనా ఆ పాత్ర ఛాయలు బాహుబలి2లో అసలే కనిపించవు. క్లైమాక్స్‌లో గుంపులో గోవిందయ్య మాదిరిగా అలా కనిపించి మాయవవుతుంది. యుద్ధ పోరాటాల్లో కూడా అవంతిక పాత్ర ఉన్నదా అనే అనుమానం కలిగిస్తుంది. పాటలు పక్కన పెడితే.. డైలాగులు కూడా మచ్చుకు వినిపించవు. ఆ పరిస్థితి చూసిన వారికెవరైనా కావాలనే ఆ పాత్రను కత్తిరించారనిపిస్తుంది. అయితే ఆ పాత్ర విషయంలో జరిగిన ఓ విషయం ఇటీవల బయటకు వచ్చింది.


గ్రాఫిక్స్ కొంపముంచాయా?

గ్రాఫిక్స్ కొంపముంచాయా?

అవంతిక పాత్రకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ఓ సంస్థకు అప్పగించారట. తీరా అవుట్ పుట్ చూశాక రాజమౌళి చాలా దారుణంగా ఉందని ఫీలయ్యారట. ఆ కారణంగానే అవంతిక పాత్రను మరోమారు ఆలోచించకుండా కత్తిరించి వేశాడనది ఇంటర్నల్ టాక్. అంతేకాకుండా బాహుబలి2 నిడివి కూడా బాగా పెరిగిపోవడంతో అవంతిక పాత్రపై కత్తెర పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే మరో వాదన. ఏదీ ఏమైనా బాహుబలి2 రికార్డులు తిరగరాస్తున్న వేళ.. ఇలాంటి రూమర్లు వినిపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.English summary
Tamannaah Bhatia received immense appreciation for her portrayal of Avanthika in Baahubali: The Beginning. However, fans of the actress were in for a shock when they watched the sequel, Baahubali: The Conclusion, as it barely has the presence of the actress. But Tamannaah says that all the reports calling them "baseless. I have great respect for Rajamouli sir and I am proud to be part of such a cult film. This film has changed my life as an actor and has absolutely raised the bar for everyone in the film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu