»   » రికార్డు దిశగా బాహుబలి2.. వందకోట్లు వసూలు.. పైరసీకి పాల్పడితే ఖబడ్దార్..!

రికార్డు దిశగా బాహుబలి2.. వందకోట్లు వసూలు.. పైరసీకి పాల్పడితే ఖబడ్దార్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ది కన్‌క్లూజన్‌ చిత్రానికి ప్రపంచవ్యాపంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన బాహుబలి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో విడుదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజే వందకోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బాహుబలి వసూలు చేసే కలెక్షన్ల అంచనా వివరాలను ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్వీట్టర్‌లో షేర్ చేశారు.

అనూహ్య స్పందన..

అనూహ్య స్పందన..

దేశవ్యాప్తంవగా ఉత్తరాతి, దక్షిణాది రాష్ట్రాలతో మిగిత రాష్ట్రాల్లో దాదాపు 6500 స్క్రీన్లలో సినిమా విడుదలైంది. రిలీజ్‌కు ముందే అడ్యాన్స్ బుకింగ్‌ అనూహ్య స్పందన వచ్చింది. కేవలం అన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్‌మైషో లోనే దాదాపు 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.

దేశవ్యాప్తంగా బాహుబలి2 కలెక్షన్లు (నికర అంచనా)

దేశవ్యాప్తంగా బాహుబలి2 కలెక్షన్లు (నికర అంచనా)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ - రూ.45 కోట్లు
హిందీ - రూ. 35 కోట్లు
తమిళనాడు - 12 కోట్లు
కర్ణాటక - రూ.10 కోట్లు
కేరళ - రూ.4 కోట్లు

మొత్తం - రూ. 106 కోట్లు

హవా కొనసాగితే వెయ్యి కోట్లు ఇలా..

హవా కొనసాగితే వెయ్యి కోట్లు ఇలా..

బాహుబలి2 సినిమా దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. బాహుబలి సినిమా విడుదలకు ముందే శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ హక్కుల కింద రూ.500 వసూలు చేసింది. తొలి రోజు అంచనాల ప్రకారం వారం నుంచి పది రోజులపాటు బాహుబలి2 హవా కొనసాగితే రూ.1000 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

పైరసీ చేస్తే ఇంక అంతే..

పైరసీ చేస్తే ఇంక అంతే..

పైరసీకి పాల్పడవద్దని బాహుబలి 2 చిత్ర బృందం పైరసీదారులను హెచ్చరించింది. సినిమాకు సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌లో అప్‌లోడ్‌ చేయొద్దని సూచించింది. యాంటీ పైరసీ టీం అలాంటి వారిని గుర్తిస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్‌ ట్వీట్‌ చేసింది. శుక్రవారం విడుదలైన ‘బాహుబలి 2' చిత్రానికి సంబంధించిన వీడియోలను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పైరసీకి పాల్పడవద్దని చిత్ర యూనిట్ హెచ్చరించింది.

English summary
The Prabhas-starrer Baahubali released in over 9000 screens worldwide. As per early trade estimates, Baahubali 2 is expected to do a whopping business of Rs 100 crore on its opening day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu