»   » ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం.. తుఫాన్ వేగంతో పీకే రికార్డు తుడిపేసేందుకు ..

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం.. తుఫాన్ వేగంతో పీకే రికార్డు తుడిపేసేందుకు ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. బాలీవుడ్‌లో అత్యధికంగా వసూళ్లు సాధించిన పీకే చిత్రం రికార్డులను తుడిచిపెట్టేందుకు బాహుబలి సిద్ధమవుతున్నది. ఈ చిత్రం గత 4 రోజుల్లో రూ.625 కోట్ల వసూళ్ల (గ్రాస్)ను రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా ఓ రికార్డు నెలకొల్పింది.

నాలుగు రోజులకు రూ.625 కోట్లు

నాలుగు రోజులకు రూ.625 కోట్లు

గత నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాహుబలి రూ.625 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో రూ.490 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.135 కోట్ల (గ్రాస్) వసూళ్లను సాధించింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

అన్ని రికార్డులు గుల్ల..

అన్ని రికార్డులు గుల్ల..

బాహుబలి హిందీ వెర్షన్ సోమవారం నాటికి అన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను తుడిచిపెట్టింది. మొదటి రెండు రోజులకు రూ.50 కోట్లు, మూడో రోజు నాటికి రూ.100 కోట్లు, నాలుగ రోజుకు రూ.150 కోట్ల బిజినెస్ చేసిందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

కలెక్షన్ల పరంగా ప్రభంజనం

కలెక్షన్ల పరంగా ప్రభంజనం

ఇక అమెరికాలో కూడా బాహుబలి2 కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తున్నది. తొలి వారాంతంలో బాహుబలి2 రూ.65.65 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ సినిమా ఇలాంటి వసూళ్లను సాధించడం తాను ఎప్పుడు చూడలేదు అని తరుణ్ ఆదర్శ్ తెలిపారు.

బాలీవుడ్ చిత్రాల రికార్డులకు ముప్పు..

బాలీవుడ్ చిత్రాల రికార్డులకు ముప్పు..

ఇప్పటివరకు బాలీవుడ్‌లో పీకే రూ. 792 కోట్లు, దంగల్ చిత్రం 744 కోట్లు, భజ్‌రంగీ భయ్‌జాన్ చిత్రం రూ.626 కోట్లు, సుల్తాన్ రూ. 589 కోట్లు, ధూమ్3 రూ. 558 కోట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రికార్డుల్లో కొన్ని ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా పీకే చిత్రం కలెక్షన్లను అధిగమించనున్నది.

పీకే రికార్డు తడిచిపెట్టడానికి...

పీకే రికార్డు తడిచిపెట్టడానికి...

బాహుబలి త్వరలోనే అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా రికార్డులను తడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నది. పీకే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.792 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారతీయ సినిమా చరిత్రలో ఇదే అత్యుత్తమ రికార్డు. ఈ రికార్డు త్వరలోనే అధిగమిస్తుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.

English summary
Baahubali 2 box office collection day 4: Four days, Rs 600 crore expected as worldwide gross and all records falling by the wayside. Baahubali The Conclusion is unstoppable. Baahubali 2 is nearing Rs 700 crore mark and it won’t take it long to overthrow Aamir Khan starrer PK’s lifetime earnings of Rs 792 crore. PK currently tops the list of India’s highest grossing films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu