For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్‌పై పిచ్చి ప్రేమ.. ప్రపోజ్ చేసేందుకు హైదరాబాద్ కు, కోల్‌కతా యువతి సాహసం!

  By Ramesh Babu
  |

  ప్రభాస్‌కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. 'బాహుబలి' సినిమాకి ముందు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ప్రభాస్ క్రేజ్.. ఆ తరవాత దేశవ్యాప్తం అయిపోయింది.

  'బాహుబలి2' విడుదల తరవాత ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు ప్రభాస్‌తో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మహిళా అభిమానుల విషయానికి వస్తే.. ప్రతి రాష్ట్రంలోనూ అమ్మాయిలు ప్రభాస్ అంటే పడి చస్తున్నారు.

  కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అమ్మాయి అంతకు మించి. ప్రభాస్ అంటే తనకు ప్రాణం అంటోంది. ప్రభాస్‌ను పెళ్లిచేసుకోవడానికి తాను దేనికైనా సిద్ధం అంటోంది. త్వరలోనే తన ప్రేమను ప్రభాస్‌కు చెప్పడానికి హైదరాబాద్ వస్తోంది.

  ప్రభాస్ పుట్టిన రోజు నాటికి...

  ప్రభాస్ పుట్టిన రోజు నాటికి...

  కోల్‌కతాకు చెందిన సుభద్ర ముఖర్జీ.. ప్రభాస్ అంటే పడిచచ్చిపోతోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు నాడు ప్రత్యేకమైన బహుమతులతో ఆమె హైదరాబాద్‌కు వస్తోంది. ప్రభాస్‌ను కలవడానికి ఇప్పటికే ఆయన సెక్రటరీని సంప్రదించిందట సుభద్ర. ఆయన సరేనని భరోసా ఇవ్వడంతో సుభద్ర ఆనందానికి అవధుల్లేవు.

  రూపుదిద్దుకుంటున్న ప్రభాస్ విగ్రహం...

  రూపుదిద్దుకుంటున్న ప్రభాస్ విగ్రహం...

  ఓ వైపు దసరా నవరాత్రులు దగ్గర పడుతుండటంతో కోల్‌కతాలోని శిల్పులంతా అమ్మవారి విగ్రహాలు తయారుచేయడంలో బిజీగా ఉన్నారు. కానీ ఒక శిల్పి మాత్రం బాహుబలి విగ్రహ తయారీలో మునిగిపోయారు. దానిని తయారు చేయిస్తున్నది సుభద్ర ముఖర్జీయే. అక్షరాలా లక్ష రూపాయలు ఖర్చుపెట్టి బాహుబలి విగ్రహాన్ని సుభద్ర తయారుచేయిస్తోంది.

  ప్రభాస్ ప్రేమను పొందడానికే...

  ప్రభాస్ ప్రేమను పొందడానికే...

  కాస్ట్యూమ్ డిజైనర్ సమరేంద్ర సింగ్ రాయ్ ఈ విగ్రహానికి దుస్తులు డిజైన్ చేస్తున్నారు. దుస్తులకు అదనంగా రూ. 20వేలు ఖర్చు చేస్తోంది సుభద్ర. ఇంతటితో ఆగకుండా ప్రముఖ బాలీవుడ్ గాయని ఉషా ఉతుప్‌తో ప్రభాస్‌పై నాలుగు పాటలతో కూడిన ఆల్బమ్‌ను తయారుచేయించింది. వాస్తవానికి దీని కోసం సుభద్ర శక్తికి మించి ఖర్చు చేస్తోంది. ఆమె తండ్రి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఇక సుభద్ర చిన్నపాటి మోడల్. అయినా ప్రభాస్‌పై తనకున్న పిచ్చి ప్రేమతో ఇవన్నీ చేస్తోంది. ఇదంతా ఎందుకు అని అడిగితే.. ‘ప్రేమను పొందడం అంత సులభం కాదు. అవునా?' అని అంటోంది.

  ప్రభాస్ కి ప్రపోజ్ చేయాలంటే...

  ప్రభాస్ కి ప్రపోజ్ చేయాలంటే...

  వీటన్నిటి పట్టుకుని కుటుంబ సభ్యులతో కలసి అక్టోబర్ 23న ప్రభాస్ ముందు వాలిపోనుంది సుభద్ర. ‘ఐ లవ్ ప్రభాస్. బాహుబలి 2 సినిమాను 20 సార్లు చూశాను. నేనేదో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికో, సెల్ఫీ తీసుకోవడానికో వెళ్లట్లేదు. ఈ బహుమతులన్నీ ఇచ్చి ప్రభాస్‌కి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. ప్రభాస్ ముందు సంప్రదాయబద్ధంగా కనిపించడానికి కాంజీవరం చీర కూడా తీసుకున్నాను. ఆ చీర కట్టుకునే ప్రభాస్ ముందుకు వెళ్తాను..' అని సుభద్ర చెప్పింది.

  ఆ వార్తలతో డిప్రెషన్ కు లోనై...

  ఆ వార్తలతో డిప్రెషన్ కు లోనై...

  వాస్తవానికి ‘బాహుబలి 2' సినిమా అనంతరం ప్రభాస్ పెళ్లిపై వచ్చిన వార్తలు చూసి సుభద్ర ముఖర్జీ చాలా బాధపడిందట. డిప్రెషన్‌కు లోనైందట. అయితే ఆ సమయంలో తల్లి ఆమెకు దన్నుగా నిలిచిందట. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇప్పుడు ప్రభాస్‌కు ప్రపోజ్ చేయడానికి హైదరాబాద్ వస్తోంది. ప్రస్తుతం తన కలల రాకుమారుడిని కలుసుకోబోతున్నాననే ఆనందంలో సుభద్ర ఉంది. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్తానా.. ప్రభాస్‌ను కలుస్తానా.. అని ఆత్రుతగా ఎదురు చూస్తోంది.

  English summary
  From being just another South Indian cine star, to making it big in Bollywood, Prabhas has come a long way. He has also become India’s regional start to get a wax statue at the famous Madame Tussauds in Bangkok. And now Kolkata’s Subhadra Mukherjee is planning big for his brithday. Subhadra, a die-hard fan of Baahubali actor, has decided to gift Prabas his statue on actor’s birthday on October 23. Prabas’s statue is being made by famous Kumartuli artist Sunil Pal and his son Monti. The statue will have the posture of warrior. “I love Prabhas. I have watched Baahubali-2 twenty times. I will not meet him to take an autograph or to click a selfies. I will propose him with all the gift,” said excited Subhadra.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X