»   » వచ్చేసింది : బాబా సెహగల్ పాడిన పవన్ సాంగ్.... (వీడియో)

వచ్చేసింది : బాబా సెహగల్ పాడిన పవన్ సాంగ్.... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :గతంలో పవర్, పవర్ అంటూ... పవన్ కల్యాణ్ పై ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసిన బాబా సెహగల్ తాజాగా మరో పాటను విడుదల చేసారు. ఆ పాటకు పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ పాటను మీరు ఇక్కడ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

స్వతహాగా తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే బాబా సెహగల్... పవర్ స్టార్ బర్త్ డే కు కొద్దినెలల నుంచే గిఫ్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. సెప్టెంబర్-2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. పవన్ కు బహుమతిగా ఈ పాటను అందించచారు సెహగల్. 'ఎ పవర్ సాంగ్' పేరుతో రిలీజ్ అయిన ఈ స్పెషల్ పాట .. పవన్ బర్త్ డే సందర్భంగా బాబా సైగల్ ఇచ్చే మ్యూజికల్ గిఫ్ట్ .

ఇక ఓ వైపు సింగర్ గా కొనసాగుతూనే.. నటుడిగానూ అదృష్టం పరీక్షించుకుంటున్న సెహగల్.. రీసెంట్ గా రుద్రమదేవి చిత్రంలో నటించాడు. సెప్టెంబర్-4న రుద్రమదేవి విడుదలవుతుండగా.. ఈ లోగా ఈ స్పెషల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మొత్తానికి... సెప్టెంబర్ తొలివారంలో ఓ వైపు పాట.. మరోవైపు నటనతో మెప్పించేందుకు సిద్ధమయ్యాడు బాబా సెహగల్.

తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఉదారగుణం, స్టైల్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పట్ల...అభిమానులు ఎంతో గర్వంగా ఫీలవుతూ ఉంటారు. అలాంటి స్టార్ కోసం పాడుతున్న పాటను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబా సెహగల్ తానే స్వయంగా లిరిక్స్ రాసి మరీ దీన్ని కంపోజ్ చేయించేసారు.

Baba Sehgal Released Pawan Kalyan song

మరో ప్రక్క...
పవన్‌కల్యాణ్‌ హీరోగా కేఎస్‌ రవీంద్ర(బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌' గబ్బర్‌సింగ్‌. ఈ చిత్ర టీజర్‌ను పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్‌లో కాజల్‌ అగర్వాల్‌ పాల్గొననున్నారట. పవన్‌కల్యాణ్‌తో మొట్టమొదటి సారిగా కలిసి నటిస్తున్న ఆమె ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని సమాచారం.

ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌, కాజల్‌తో పాటుగా మరాఠి నటుడు శరద్‌ కేల్కర్‌, చరణ్‌ దీప్‌, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో 'సర్దార్‌.. గబ్బర్‌సింగ్‌'ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది.


English summary
Ace pop singer Baba Sehgal released special song on Power Star Pawan Kalyan. Baba Sehgal who delighted Pawan Kalyan's fans on his birthday in 2012 with a special song video is now coming with another video on Sep, 2nd to thrill fans.
Please Wait while comments are loading...