»   » కిక్కో కిక్: మెగాస్టార్ మెచ్చుకున్నారంటూ మారుతి

కిక్కో కిక్: మెగాస్టార్ మెచ్చుకున్నారంటూ మారుతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎంతో అనుభవం ఉండి, ఎన్నో సినిమాలు చేసిన చిరంజీవి వంటి మెగాస్టార్ ఓ టీజర్ ని మెచ్చుకున్నాడంటే అందులో విషయం ఉన్నట్లే కదా. ఇక ఆ టీజర్ కు చెందిన డైరక్టర్ కు ఎంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు మారుతి అలాగే మేఘాలతో తేలిపోతున్నారు.

'భలే భలే మగాడివోయ్' హిట్ తర్వాత దర్శకుడు మారుతి హీరో వెంకటేష్‌ తో కలిసి 'బాబు బంగారం' సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ విడుదలైన అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


అంతేకాకుండా ఈ టీజర్ మెగాస్టార్ చిరంజీవి కి కూడా విపరీతంగంగా నచ్చేసిందట. ఆ విషయం చెబుతూ దర్శకుడు మారుతి 'బాబు బంగారం' టీజర్ బాగుందని మెగాస్టార్ చిరంజీవి గారు కాంప్లిమెంట్స్ ఇవ్వడం సంతోషం. బాస్ కాంప్లిమెంట్లు సూపర్ కిక్క్ నిస్తుంటాయి' అని ట్వీట్ చేశాడు.'భలే భలే మగాడివోయ్'సక్సెస్ తరువాత మారుతి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. వెంకీతో మూడో సారి నయనతార నటిస్తున్న ఈ సినిమా జులై 23 విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళుతున్నారు. అలాగే, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలో పూర్తిచేసి జూలై మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తరువాత మారుతి రూపొందిస్తున్న చిత్రమిదే.


Babu Bangaram teaser Gets Chiru Appreciations

నిర్మాతలు మాట్లాడుతూ, 'ఫ్యామిలీ చిత్రాల కథానాయికుడిగా వెంకటేష్‌ మంచి పేరు తెచ్చుకున్న విషయం విదితమే. ఆయన మరోసారి తన మార్క్‌ వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నారు. వెంకటేష్‌ నుంచి ప్రేక్షకులు కోరుకునే కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. యూత్‌, మాస్‌ ఆడియెన్స్‌కి నచ్చే అంశాలను సైతం మేళవించి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిస్తున్నాం. దర్శకుడు మారుతి వెంకటేష్‌ పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నారు.


శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఆద్యంతం వైవిధ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం మా బ్యానర్‌కి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ కామిక్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
English summary
Dasari Maruthi tweeted "Happy to receive best compliments frm #Megastar #Chiranjeevi garu for #BabuBangaram teaser. BOSS compliments always ll give super kick"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu