»   » జపాన్‌లో బాహుబలి అరాచకం..100 రోజులు దాటినా తిరుగులేకుండా!

జపాన్‌లో బాహుబలి అరాచకం..100 రోజులు దాటినా తిరుగులేకుండా!

Subscribe to Filmibeat Telugu

భారతీయ చలన చిత్ర చరిత్రలో బాహుబలి2 చిత్రం ఒక చరిత్ర. ఈ చిత్రం సృష్టించిన రికార్డులు, సాధించిన కలెక్షన్లు అనితర సాధ్యమైనవి. బాహుబలి 2 చిత్రం ఇందిలోనే కాదు విదేశాల్లో కూడా రాణించింది. ఇప్పటికి రాణిస్తూనే ఉంది. బాహుబలి 2 చిత్రం విడుదలై దాదాపు ఏడాది గడుస్తున్నా సంచలనాలు ఆగడం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. బాహుబలి 2 చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ హిట్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. బాహుబలి 2 చిత్రం జపాన్ లో 100 రోజులకుపైగా ప్రదర్శించబడుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది.

దర్శక ధీరుడి విజన్

దర్శక ధీరుడి విజన్

దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కు ప్రతిరూపం బాహుబలి చిత్రం. ప్రభాస్, రానా పోటా పోటీగా నటించారు. దేవసేనగా అనుష్క ఆకట్టుకుంది. బాహుబలి మొదటి భాగంతో అంచనాలని పెంచిన రాజమౌలి, రెండవ భాగంలో అద్భుతమే చేసాడు.


Barath Ane Nenu Hope To Cross Bahubali In Collections
 దేశ విదేశాల్లో

దేశ విదేశాల్లో

బాహుబలి చిత్రం ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో సైతం అద్భుతాలు చేసింది. బాహుబలి చిత్రం చైనాలో కూడా విడుదలై రాణించింది.


100 రోజులు పూర్తి

100 రోజులు పూర్తి

బాహుబలి 2 చిత్రం జపాన్ లో సంచలనాలు సృష్టిస్తోంది. మంగళవారంతో బాహుబలి 2 జపాన్ లో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.100 రోజులు దాటిన తరువాత కూడా ఈ చిత్రం అద్భుతంగా రాణిస్తోంది. ఈ చిత్రం జపాన్ లో 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.


 బాహుబలి ప్రభంజనం

బాహుబలి ప్రభంజనం

బాహుబలి 2 చిత్రం గత ఏడాది ఏప్రిల్ 28 న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలిరోజే 100 కోట్లు కలెక్షన్లు సాధించడం విశేషం. 10 రోజులు తిరిగేసరికి 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.


ఎక్కువగా మాట్లాడుకున్న అంశం

ఎక్కువగా మాట్లాడుకున్న అంశం

బాహుబలి 2 చిత్రంలో అంతా చర్చించుకున్న మరో అంశం విజువల్ ఎఫెక్ట్స్. ఏ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో అబ్బురపరిచారు. మాహిష్మతి రాజ్యాన్ని విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించిన విధానం అభిమానులని ఆకట్టుకుంది. ప్రభాస్, రానా మధ్య పోరాట సన్నివేశాలు, అనుష్కతో రొమాన్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.


English summary
Bahubali 2 continues its successful run in Japan. Bahubali2 completes 100 days in Japan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X