»   » గుర్తుపెట్టుకోండి : రాజమౌళి ‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ ఎన్ని గంటలకు అంటే

గుర్తుపెట్టుకోండి : రాజమౌళి ‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ ఎన్ని గంటలకు అంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజమౌళి దర్సకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన 'బాహుబలి'కి సీక్వెల్ గా తీస్తున్న చిత్రం 'బాహుబలి 2'. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరో ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబరు 22న ముంబయి ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని గంటలకు విడుదల చేస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.


23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా 22 సాయంత్రం 4 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు 'బాహుబలి' చిత్ర యూనిట్ ట్వీట్‌ చేసింది.


ప్రస్తుతం ముంబైలో వైభవంగా జరుగుతున్న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగమైన మూవీమేళా అనే ప్రోగ్రామ్‌లో ఈ ఫస్ట్‌లుక్‌ విడుదలవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి రాజమౌళితో సహా టీమ్ అంతా హాజరు కానున్నారు. అదే రోజున సాయంత్రం ఆన్‌లైన్లో ఫస్ట్‌లుక్ విడుదల కానుంది.


ఈ విజువల్‌ వండర్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసులు వర్షాన్ని కురిపించింది. ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌'ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2017 ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న 'బాహుబలి 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్‌, శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలోఇప్పటికే అమ్ముడు పోయాయి.


English summary
The first look poster of Bahubali 2 is getting ready to unveil at Jio MAMI Movie Mela with Star on October 22.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu