»   » 50 మిలియన్, బాహుబలి ఆల్ ఇండియా రికార్డ్‌పై రాజమౌళి స్పందన

50 మిలియన్, బాహుబలి ఆల్ ఇండియా రికార్డ్‌పై రాజమౌళి స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-ది కంక్లూజన్' ట్రైలర్ గురువారం రిలీజై ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసి ఆలిండియా రికార్డ్ నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తెలుగు, హిందీ, మళయాలం, తమిళంలో రిలీజ్ అవ్వగా.... 24 గంటల్లో 50 మిలియన్ (5 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ తో పాటు ఫేస్ బుక్, ఇతర మాద్యమాలన్నింటి ద్వారా కలిపి 24 గంటల్లో ఇంత రెస్పాన్స్ వచ్చింది. దీనిపై రాజమౌళి స్పందించారు.

ట్రైలర్ ను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా బాహుబలి చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలియజేసింది. ట్రైలర్ కు ఒక్కరోజుల్లో ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

 50 మిలియన్

50 మిలియన్

ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా ఒక్కరోజులో ఇంత భారీ స్పందన రాలేదు. ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో వచ్చే నెలలో విడుదల కాబోతున్న సినిమాకు రెస్పాన్స్ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తెలుగు ట్రైలర్ కౌంట్

బాహుబలికి సంబంధించి తెలుగు ట్రైలర్ కే ఎక్కువ స్పందన వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నానికి ట్రైలర్ వ్యూస్ కౌంట్ 2 కోట్ల 24 లక్షలకు చేరుకుంది.

హిందీ ట్రైలర్ కౌంట్


తెలుగు తర్వాత ఎక్కువ స్పందన హిందీలో రిలీజైన ట్రైలర్ సొంతం చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నానికి ట్రైలర్ వ్యూస్ కౌంట్ 1 కోటి 17 లక్షలకు చేరుకుంది.

తమిళ్ ట్రైలర్ కౌంట్


తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు 3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

English summary
Baahubali 2 trailer which took the internet by storm yesterday, has enjoyed mind-blowing views. The trailer views of all 4 versions crossed 50 million in just 24 hours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu