twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి-2 ట్రైలర్లో దోషం.... సోషల్ మీడియాలో రచ్చ!

    ఇండియన్ ప్రేక్షకులంతా గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి-2’ మూవీ మరో నెల రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారడానికి నిన్న రిలీజైన ట్రైలర్ ఒక్క రోజు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ ప్రేక్షకులంతా గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న 'బాహుబలి-2' మూవీ మరో నెల రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారడానికి నిన్న రిలీజైన ట్రైలర్ ఒక్క రోజులోనే 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడమే నిదర్శనం.

    అయితే బాహుబలి 2 ట్రైలర్ లో ఒక చిన్నపాటి తెలుగు వ్యాకరణ దోషం దొర్లడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. రాజమౌళి లాంటి జీనియస్ డైరెక్టర్ సినిమాలో ఇలాంటి తప్పులు దొర్లడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

    ఏమిటా దోషం?

    ఏమిటా దోషం?

    ట్రైలర్‌లో కట్టప్పతో అమరేంద్ర బాహుబలి ఓ సన్నివేశంలో... ‘‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకు.. నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా'' అనే డైలాగ్ చెబుతాడు. అయితే ఈ డైలాగులో వ్యాకరణ దోషం ఉందని.... ఆ డైలాగ్ అలా కాకుండా ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టబోడు మామా' అని ఉండాలని అంటున్నారు.

    ఇంతకు ముందు పోస్టర్ విషయంలో రచ్చ

    ఇంతకు ముందు పోస్టర్ విషయంలో రచ్చ

    రీసెంట్ గా రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఎస్ఎస్ రాజమౌళి ట్వీటర్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో చిన్న మిస్టేక్ ఉంటే దీన్నిపై కూడా అప్పట్లో రచ్చ చేసారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ పోస్టర్ లో ..ప్రభాస్ వెనకగా, అనుష్క ముందుగా ఉంది. అనుష్క చేతిలో మూడు బాణాలు, ఓ ధనుస్సు ఉంది. ప్రభాస్ ఆమె వెనక మూడు బాణాలు, ధనుస్సు పట్టుకుని ఉన్నారు. లెక్కప్రకారం ప్రభాస్... చేతిలో ఉన్న మూడు బాణాలు ...అనుష్క చేతిలో ఉన్న తెల్ల ధనుస్సు వెనుక నుంచి వెళ్లాలి. కానీ అలా జరగలేదు. ప్రభాస్...బాణాలు...మూడు...అనుష్క పట్టుకున్న ధనుస్సు మీదుగా వెళ్తున్నాయి. అది అసాద్యం అని నెట్ జనుల వాదన.

    అలాంటి వారు ఉంటారు

    అలాంటి వారు ఉంటారు

    సినిమా అన్నాక చిన్న చిన్న తప్పులు దొర్లడం మామూలే. అయితే అలాంటి వాటిని భూతద్దంలో పెట్టిమరీ వెతికి అదే పనిగా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి వాటిలో ప్రచారం చేసే వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో రాజమౌళి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    బాహుబలి పార్ట్ 1లో 145 మిస్టేక్స్ అంటూ అప్పట్లో వీడియో

    బాహుబలి పార్ట్ లో దాదాపు 145 మిస్టేక్స్ దొర్లాయంటూ అప్పట్లో కొందరు బాలీవుడ్ బాబులు ఓ వీడియో రిలీజ్ చేసి మరీ ఎత్తి చూపారు. అందుకే పార్ట్ 2లో విజుల్స్ పరంగా, మరే విధంగానూ మిస్టేక్స్ లేకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    English summary
    Finally, the makers released the much-awaited trailer of “Bahubali 2: The Conclusion” online and also in 300 theaters across Andhra Pradesh and Telangana. However, this intense trailer is filled with some mistakes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X