»   » కొత్తగా ఉంది, బ్లాక్ మెయిల్ చేసారు: పోలీసులతోకలిసి రాజమౌళి ప్రెస్‌మీట్

కొత్తగా ఉంది, బ్లాక్ మెయిల్ చేసారు: పోలీసులతోకలిసి రాజమౌళి ప్రెస్‌మీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి మూవీ పైరసీ అడ్డుకున్న పోలీసులకు థాంక్స్ చెప్పారు ద్శకుడు రాజమౌళి. శనివారం ఆయన సిసీఎస్ సైబర్ కార్యాలయానికి వెళ్లి డిసిపి రఘువీర్, ఏసిపీ అవినాష్ మహంతిని కలిసారు. బాహుబలి 2 పైరసీ కేసు పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రాజమౌళి పోలీసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సినిమాల్లో కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతున్నట్లే పైరసీ చేసే వాళ్లు కూడా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని రాజమౌళి చెప్పుకొచ్చారు.


కొత్తగా ఉంది

కొత్తగా ఉంది

ఇప్పటి వరకు మారుమూల థియేటర్లలో క్యామ్ కాడర్స్ పెట్టి అర్థరాత్రి రికార్డ్ చేసే వారు. ‘ఈగ' టైంలో అలా జరిగితే చిత్తూరు జిల్లాలో ఓ థియేటర్ ను క్లోజ్ చేయించాం. అలా పైరసీ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రతలన్నీ తీసుకుంటున్నాం. ఇపుడు కొత్తగా డైరెక్టుగా సర్వర్ కు కనెక్ట్ చేసి సినిమాను డౌన్ లోడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఇలా జరిగేవ కాదు అని రాజమౌళి తెలిపారు.


బ్లాక్ మెయిల్ చేయడం కూడా ఇదే తొలిసారి

బ్లాక్ మెయిల్ చేయడం కూడా ఇదే తొలిసారి

ఇంతకు ముందు సినిమా పైరసీ డౌన్ లోడ్ చేసుకునేలా ఆన్ లైన్ లో పెట్టేవారు. కానీ ఈ సారి అలా చేయకుండా నేరుగా నిర్మాతలకు ఫోన్ చేసి మా వద్ద పైరేటెడ్ సీడీ ఉంది. సాంపిల్ గా మీకు కాపీ పంపిస్తున్నాం, డబ్బులు ఇవ్వకుంటే రిలీజ్ చేస్తాం అని బెదిరిస్తున్నారు.... ఇటీవల బాహుబలి-2 పైరసీ విషయంలో అలానే జరిగింది అని రాజమౌళి తెలిపారు.


పోలీసులు సీరియస్‌గా పని చేసారు.

పోలీసులు సీరియస్‌గా పని చేసారు.

బాహుబలి-2 పైరసీ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా, పర్సనల్ ఇంట్రెస్టుతో హ్యాండిల్ చేసారు. పోలీస్ ఆఫీసర్ ఒకరు ఆర్కా ఆఫీసుకు వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేసి.... పైరసీ చేసే వారితో బేరసారాలు చేసారు, వారి వివరాలు కనుక్కుని బీహార్ వెళ్లి అరెస్టు చేసారు.... అని రాజమౌళి తెలిపారు.


అందరి సహకారం ఉండాలి

అందరి సహకారం ఉండాలి

పైరసీ అరికట్టాలంటే కేవలం నిర్మాతల వల్లనో, పోలీసుల వల్లో కాదు..... సినిమా రిలీజ్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి. పైరసీ బయటకు వచ్చాక అరికట్టడం కంటే, పైరసీ చేయడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి అని రాజమౌళి తెలిపారు.English summary
Tollywood director SS Rajamouli and Producer Shobhu Yarlagadda Meet CCS police Over to Know Bahubali2 Piracy Case Details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu