»   »  ఫస్ట్ లుక్ లు వచ్చేసాయి: 'బాహుబలి' ని బీట్ చేస్తుందంటున్నారు

ఫస్ట్ లుక్ లు వచ్చేసాయి: 'బాహుబలి' ని బీట్ చేస్తుందంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్యకాలంలో ఏ చిత్రానికి లేనంత క్రేజ్ 'బాహుబలి' కు వచ్చింది. దానికి తగ్గట్లే హిందీ, తెలుగు,తమిళ,మళయాళ భాషల్లో విడుదలై విజయవంతంగా నడుస్తోంది. చిత్రం కలెక్షన్స్ చూసి అందరూ నోరెళ్లి బెట్టి చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని బీట్ అవుట్ చేసే సినిమాలు వస్తాయా అనే చర్చ మొదలైంది. అయితే త్వరలో బాలీవుడ్ లో విడుదల కానున్న చిత్రం ఒకటి ...ఈ బాహుబలి ని బీట్ చేయవచ్చు అని అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటీ అంటే....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణం తొలిరూపులను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మీరు క్రింద ఈ ఫొటోలను చూడవచ్చు.

'బాజీరావ్‌ తుపానులా రాబోతున్నాడ'ని రణ్‌వీర్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు.

బాలీవుడ్‌లో ఈ సినిమా సంచలనాత్మక విజయం సాధించడం ఖాయమని రణ్‌వీర్ భరోసా ఇస్తున్నాడు. రణ్‌వీర్ ‘గెటప్' వివరాలను ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచిన దర్శకుడు బన్సాలీ ఇపుడు హీరో, హీరోయిన్ల ‘ఫస్ట్ లుక్'ను విడుదల చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.

స్లైడ్ షోలో... ఆ వివరాలు చూడండి...

బయోపిక్...

బయోపిక్...

మరాఠా యోధుడు బాజీరావ్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు.

అంచనాలు ...

అంచనాలు ...

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ‘ఫస్ట్‌లుక్'పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

బాజీరావ్‌గా యువనటుడు రణ్‌వీర్ సింగ్

బాజీరావ్‌గా యువనటుడు రణ్‌వీర్ సింగ్


బాజీరావ్‌గా గుండు, కోరమీసంతో రణ్‌వీర్‌ కొత్తగా కనిపిస్తున్నారు. నుదుట చందన తిలకం, చెవిదుద్దులు, బంగారు పూసల దండలు ధరించిన ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది.

రెండు పాత్రలూ..

రెండు పాత్రలూ..


ఈ చిత్రంలో కనిపించే ఈ రెండు పాత్రలూ పోటా పోటీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

బాజీరావ్ మొదటి భార్య (కాశీబాయి)

బాజీరావ్ మొదటి భార్య (కాశీబాయి)

బాజీరావ్‌ భార్య కాశీబాయిగా తలపై కిరీటం, నవారీ చీర, సొగసైన ముక్కుపుడకతో ప్రియాంక చోప్రా ఆహార్యం ఆకట్టుకుంటోంది.

అదురుతుంది

అదురుతుంది

పీష్వా బాజీరావు పాత్రలో రణ్‌వీర్ సింగ్ కనపడటమే సినిమాకు నిండుతనం వచ్చిందంటున్నారు.

పోరాటలు చేసే రాణి (మస్తానీ)

పోరాటలు చేసే రాణి (మస్తానీ)


బాజీరావ్‌ ప్రేయసి మస్తానీగా నటిస్తున్న దీపికా పదుకొణె చేతిలో విల్లుతో వీరనారిలా కనిపిస్తోంది.

పోటీగా కిస్మస్ కానుక...

పోటీగా కిస్మస్ కానుక...


షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన ‘దిల్‌వాలే' విడుదలయ్యే రోజునే అంటే కిస్మస్ కానుకగా...(డిసెంబర్ 18) ‘బాజీరావ్ మస్తానీ' కూడా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లోను, థియేటర్లలోను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ‘కండల వీరుడు' సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్'తో పాటు ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులు వీక్షించవచ్చు.

English summary
A storm is coming, promised actor Ranveer Singh on Twitter. His Game of Thrones-esque pronouncement refers to Sanjay Leela Bhansali's period piece Bajirao Mastani, the first glimpses of which have been released. Stills released on Twitter by producers Eros show Ranveer and actresses Deepika Padukone and Priyanka Chopra as their characters in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu