»   »  శివ లింగంపై బీర్ తో అభిషేకమా, సిగరెట్లు కాల్చి ధూపమా, ఇదేం తెలుగు సినిమా?

శివ లింగంపై బీర్ తో అభిషేకమా, సిగరెట్లు కాల్చి ధూపమా, ఇదేం తెలుగు సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా టీజర్ ని విడుదల చేసారని , టీజర్ ని యూట్యూబ్ నుంచి తొలిగించకపోతే బౌతికదాడులకు దిగుతామని భజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించారు. ఇంతకీ అంత దారుణంగా చేసిన వదిలిన టీజర్ ఏంటి..అందులో నిజంగా మనోభావాలు దెబ్బతినే మ్యాటర్ ఉందా అనే సందేహం కలుగుతోందా..అయితే ముందు ఈ టీజర్ చూడండి..తర్వాత క్రింద కామెంట్ల రూపంలో మాట్లాడండి.

నిజమే అనిపిస్తోంది కదా..ఈ టీజర్‌లో వేంకటేశ్వరస్వామి ఫొటోను నేలకేసి కొట్టడంతో పాటు ప‌విత్ర‌ శివలింగంపై బీరుతో అభిషేకం చేయడం, సిగరెట్లు కాల్చి ధూపం పెట్టడం లాంటి ప‌లు స‌న్నివేశాలు హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నాయ‌ని వారు పేర్కొన్నారు.

ఇటువంటి స‌న్నివేశాలు తీయ‌డ‌మే కాకుండా వాటినే యూట్యూబ్‌లో పెట్టి ప‌బ్లిసిటీ చేసుకుంటున్నార‌ని, వెంటనే ఆ టీజర్‌ను యూట్యూబ్ నుంచి తీసేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ సినిమా నిర్మాత హ‌రితో పాటు ద‌ర్శ‌కుడిని అరెస్టు చేయాల‌ని వారు పోలీసుల‌ను కోరారు.

Bajrang Dal activists protest and warning to Devuda Makers

ద‌ర్శ‌కుడు సాయిరాం దాసరి తెలుగులో తెర‌కెక్కిస్తున్న'ద్యావుడా' సినిమాపై భ‌జ‌రంగ్‌ధ‌ళ్ కార్య‌క‌ర్త‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉంద‌ని వారు ఆందోళ‌న తెలిపారు.

త్వ‌ర‌లో ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నార‌ని, విడుదలను ఆప‌క‌పోతే భౌతిక దాడులకు దిగుతామ‌ని భ‌జరంగ్‌ధళ్ కార్యకర్తలు హెచ్చరించారు. ఇటీవ‌లే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా యూట్యూబ్‌లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌లో కొన్ని అభ్యంత‌ర‌క‌ర‌ దృశ్యాలు ఉన్నాయని నెరేడ్‌మెట్‌ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

Bajrang Dal activists protest and warning to Devuda Makers

శాన్వి క్రియేషన్స్, అమృతసాయి ఆర్ట్స్‌ క్రియేషన్స్ పతాకంపై సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ద్యావుడా'. జి.హరికుమార్‌ నిర్మాత. భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య నటీనటులు. ''టైటిల్‌ పాజిటివ్‌గా ఉంది. టీజర్‌ చూశాక అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ సినిమా తీసినట్లుంది'' అని రాజ్‌ కందుకూరి అన్నారు.

Bajrang Dal activists protest and warning to Devuda Makers

''లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న మూడు జంటలు ఓ పామ్‌హౌ్‌స్‌‌‌కి వెళ్లినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చాడు అన్న భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాత చెప్పారు.

English summary
Activists of right-wing outfits Bajrang Dal and Hindu Sena demanding ban on a new movie Devuda teaser for allegedly hurting religious sentiments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu