twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి సినిమానే స్పూర్తి: భజరంగీ... పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

    భజరంగి.... సినిమాకి స్పూర్తి చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' సినిమా అని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు అందరి ముందూ వెల్లడించారు.

    |

    హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమా వచ్చినప్పుడు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక పెద్ద విమర్శని ఎదుర్కొన్నారు. ఆ సినిమా కథ తనదే అనీ, దాన్ని కాపీకోట్టి సినిమాగా తీసారనీ, దానివల్ల తన కెరీరే నాశనం అయిపోయిందంటూ ముంబై హైకోర్టులో డైరక్టర్ మరియు టీవి ప్రొడ్యూసర్ అయిన మహిమ్ జోషి కేసు వేసారు.

     ఆ కేసు వీగిపోయింది

    ఆ కేసు వీగిపోయింది

    స్క్రీన్ ప్లే నుంచి లొకేషన్స్ వరకూ అంతా తన స్క్రిప్టునే పోలి ఉందని ఆయన కేసు వేసారు. ఈ మేరకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ను కోర్టుకు సమర్పించారు. డిటేల్డ్ గా తన స్క్రిప్టులోని సీన్స్ కు, సల్మాన్ సినిమాలోని సీన్స్ కు సీక్వెన్స్ కు ఉన్న పోలిక లు చెపుతూ ఆయన ఈ కేసుని ఫైల్ చేసారు. జూలై 2007 లో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసానని ఆయన ఆధారాలు చూపెట్టాడు. అయితే ఆ తర్వాత ఆ కేసు వీగిపోయింది...

    ట్రైలర్ విడుదలైన నాటి నుంచి

    ట్రైలర్ విడుదలైన నాటి నుంచి

    అప్పట్లో చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు సైతం ఇచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటి నుండీ ఇది చిరంజీవి సూపర్ హిట్ చిత్రం పసివాడి ప్రాణం కథ నుంచి ప్రేరణ పొందింది అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిలీజై అంతటా అదే జోరుగా వినిపించింది.

     చిరంజీవి 1987లో నటించిన

    చిరంజీవి 1987లో నటించిన

    ఈ విషయమై ఈ చిత్రం కథ రచయిత విజయేంద్రప్రసాద్ సైతం నిజమైనన్నట్లు సమాచారం కూడా. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ...చిరంజీవి 1987లో నటించిన పసివాడి ప్రాణం చిత్రం నన్ను అప్పట్లో బాగా కదిలించింది. దాన్ని పూర్తి మార్పులతో కాంటెంపరెరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నట్లు తెలిపారు.

    డైరెక్ట్ గా ఆయనే చెప్పాడు

    డైరెక్ట్ గా ఆయనే చెప్పాడు

    ఈ లోగా తాను ఓ పాకిస్దానీ జంట...తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం ఇండియాకు వచ్చినట్లు..అక్కడ ఖర్చు భరించలేక ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్త రావటం గమనించానని..కథని సిద్దం చేసానని అన్నారు. పసివాడి ప్రాణం సినిమాలో మూగ అబ్బాయి చుట్టూ కథ తిరిగితే..ఇక్కడ మూగ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పారని అన్నారు. అయితే ఇన్నాళ్ళకి డైరెక్ట్ గా ఆయనే చెప్పాడు...

     రచయిత విజయేంద్ర ప్రసాద్

    రచయిత విజయేంద్ర ప్రసాద్

    భజరంగి.... సినిమాకి స్పూర్తి చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' సినిమా అని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు అందరి ముందూ వెల్లడించారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు టెలివిజన్‌ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ, టెలివిజన్‌ దర్శకుల శిక్షణ శిబిరం ముగింపోత్సవంలో పాల్గొని మాట్లాడారు.

     కథ చెప్పడానికీ, కాపీ కొట్టడానికి తేడా

    కథ చెప్పడానికీ, కాపీ కొట్టడానికి తేడా

    ఏదైనా కథ నుంచి స్ఫూర్తి పొంది కొత్తగా కథను చెప్పడానికీ, కాపీ కొట్టడానికి తేడా ఉందని అన్నారు. రచయితకు కథపై పట్టుతో పాటు చెప్పాలనుకున్న విషయంపై క్లారిటీ ఉండాలని అన్నారు. అలాగే దర్శకుడికి సినిమాలోని 24 విభాగాలపైన సమగ్ర అవగాహన ఉండాలని ఆయన సూచించారు.

    English summary
    Writer, director KV Vijayendra Prasad says that Bajrangi Bhaijaan is inspired from Chiru's Pasivadi Pranam movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X