»   »  సల్మాన్ ఖాన్.... రియల్ లైప్ బజరంగీ భాయిజాన్!

సల్మాన్ ఖాన్.... రియల్ లైప్ బజరంగీ భాయిజాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ కు చెందిన చిన్నారి ఇండియాలో తప్పి పోవడం, ఆమెను పాకిస్థాన్ లోని ఇంటికి చేర్చడానికి బజరంగీ చేసిన ప్రయత్నమే బాలీవుడ్ మూవీ 'బజరంగీ భాయిజాన్'. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. నిజజీవితంలోనూ బీయింగ్ హ్యూమన్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న సల్మాన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

ఇంటి నుంచి పారిపోయిన నలుగురు చిన్నారులను మళ్లీ వారి కుటుంబాలతో కలిపాడు. ఈ ప్రక్రియలో సల్మాన్ కు అంతర దేశాయ్ అనే సామాజిక కార్యకర్త సహాయపడ్డారు. మహారాష్ట్రలోని కర్జాత్ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు.

Bajrangi Bhaijaan reunites runaway kids with parents

పాకిస్థాన్లో గీత...
‘బజరంగీ భాయిజాన్' సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే సినిమా స్టోరీని తలపించే రియల్ సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో మున్ని మాదిరిగా.... రియల్ లైఫ్ లో గీత అనే అమ్మాయి విషయం తెరపైకి వచ్చింది. సినిమాలో మున్నీ స్వస్థలం పాకిస్థాన్ కాగా ఇండియాలో తప్పిపోతుంది. అయితే రియల్ లైఫ్ గీత స్టోరీ ఇందుకు పూర్తి అపోజిట్ గా ఉంది. గీత భారత్ నుండి తప్పిపోయి పాకిస్థాన్ చేరింది.

భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను తన తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు తెలిపాడు. తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలని ఆమె కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని అన్నాడు. స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత తనను కలవాలనుకుని గీత అనుకుంటే ఆమెను కలుస్తానని సల్మాన్ హామీ ఇచ్చాడు సల్మాన్. 15 ఏళ్ల పాటు పాకిస్థాన్ లో ఆమెకు ఆశ్రయం కల్పించిన స్వచ్ఛంద సంస్థకు థ్యాంక్స్ చెప్పాడు.

అయితే గీత తమ కూతురంటే తమ కూతురంటూ...ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మతో పాటు, పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన నాలుగు కుటుంబాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో గీత ఎవరి కూతురు? అనేది తేలాల్సి ఉంది.

English summary
Salman Khan, who is popular for his generosity, reunited four runaway teenagers with their parents. According to a report on Bollywoodlife, Salman decided to help these kids when he heard their stories of how they had eloped from their homes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu