»   »  బాలయ్యతో గుణశేఖర్, రాజు

బాలయ్యతో గుణశేఖర్, రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bala Krishna
బాలకృష్ణ ఇప్పుడు భారీ చిత్రాల నిర్మాత ఎమ్.ఎస్.రాజు తో జత కట్టనున్నారు. ఒక్కడు వంటి మెగా హిట్ ని అందించిన గుణశేఖర్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు.సాధు అని వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. నిజానికి ఈ కాంబినేషన్ చాలా అరుదైనది. ముగ్గురూ భారీ చిత్రాల కేటగిరికి సంభందిచిన వాళ్ళే. అంతే గాక వీరి మధ్య మరో పోలిక ఉంది. అది ఆట,వాన చిత్రాలతో ఎమ్.ఎస్.రాజు, అర్జున్ ,సైనికుడు చిత్రాలతో గుణశేఖర్, మహారధి, ఒక్క మగాడులతో బాలకృష్ణ వరస భారీ ఫ్లాపులను ఎదుర్కొన్నవాళ్ళు. కాని గతంలో మెగా హిట్స్ ఇచ్చి ఉండటంతో ముగ్గురికీ మార్కెట్లో, ప్రేక్షకులలో మంచి క్రేజి ఉంది.దాంతో ఈ కాంబినేషన్ కి ఓ రకమైన హైప్ క్రియోట్ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న పాండురంగడులో నిమగ్నమై ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ఈ చిత్రంలో నటించనున్నారు. ఎమ్.ఎస్.రాజు పుట్టిన రోజైన మే 10న ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని తెలిసింది. అందరి అంచనాలను మించి ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X