»   » చిత్రహింసలు పెట్టాడు, కులం పేరుతో..: నటుడి భార్య ఫిర్యాదు

చిత్రహింసలు పెట్టాడు, కులం పేరుతో..: నటుడి భార్య ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా సంబందాలంటేనే చాలా రకాల కాంట్రవర్సీలతో కూడుకుని ఉంటాయి. బయటి సామాజిక జీవితాలకీ ఇండస్ట్రీ లో ఉన్న వారి లైఫ్ స్టైల్ కీ చాలానే తేడా ఉంటుంది అందుకే ఎక్కువగా విడాకులూ, అఫైర్లూ, బ్రేకప్ లూ ఉంటూనే ఉంటాయి. అయితే ఈ తరహా విడిపోవటాలు ఒకప్పుడు స్టార్ రేంజ్ లో ఉన్న వారికే తప్ప చిన్న నట్టుల్లో చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ కూదా అదే పరిస్థితి. నటీ నటుల కాపురాలు వరుసగా కూలిపోతూనే ఉన్నాయి...

Balaji Wife Lodged Complaint in Police Station against her husband

తాజా గా తమిళ హాస్యనటుడు బాలాజీపై వేధింపుల కేసు నమోదైంది. చెన్నై శివారు ప్రాంతం మాధవరం పోలీసుస్టేషన్‌లో స్వయానా ఆయన భార్యే ఈ కేసు దాఖలు చేసింది. తనపై అనుమానంతో బాలాజీ తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసిస్తున్నాడని అతని భార్య నిత్య గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అందులో తనను బెదిరించడంతోపాటు కులం పేరుతో దూషించాడని కూడా నిత్య పేర్కొంది. బాలాజీ కన్నడ బ్రాహ్మణుడు కాగా, నిత్య దళిత కులానికి చెందిన అమ్మాయి.తమిళ సినిమాలు, టీవీ సీరియల్స్‌, రియాల్టీ షోలతో పాపులర్‌ అయిన నటుడు బాలాజీ . ఈయన ఎనిమిదేళ్ళ క్రితం నిత్య అనే మహిళను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు.

Balaji Wife Lodged Complaint in Police Station against her husband

వీరిద్దరూ చెన్నై నగర శివారు ప్రాంతమైన మాధవరంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పాప ఉంది. సజావుగా సాగుతున్న వారి సంసారం కొన్ని నెలలుగా ఇబ్బందుల్లో పడింది. భార్యాభర్తలిద్దరి నడుమ మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.

English summary
Nithya lodged a complaint at the Madhavaram police station stating that Balaji is harassing her and is also using her caste name to degrade her. The police has started an inquiry into the matter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu