For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్యపై దుష్ప్రచారం, 103 నాదే... డ్రగ్స్ ఇష్యూలో ఆయనే దైర్యం: పూరి

  By Bojja Kumar
  |

  ఈ సమాజంలో ఎవరి విషయంలో అయినా మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతోంది. బాలయ్య విషయంలోనూ అలాంటి దుష్ప్రచారమే జరుగింది అని అభిప్రాయ పడ్డారు దర్శకుడు పూరి జగన్నాథ్. బాలయ్యతో ఆయన చేసిన 'పైసా వసూల్' చిత్రం మంచి వసూళ్లతో రన్ అవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు.

  బాలయ్య ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆయనది ఎంతో మంచి మనసు అని..... బాలయ్యను దగ్గరగా చూస్తే ఎవరైనా లవ్‌లో పడిపోతారు. అంత జెన్యూన్‌ పర్సన్‌ని నేనింత వరకూ చూడలేదు. నేనే కాదు, మా యూనిట్‌లో అందరూ ఆయనతో లవ్‌లో పడిపోయారు అని పూరి తెలిపారు.

  అలా పిలిస్తే ఒప్పుకోరు

  అలా పిలిస్తే ఒప్పుకోరు

  నేను ‘‘బాలకృష్ణగారూ'' అంటే ఆయన ఒప్పుకోరు. ‘‘నో.. ‘బాలా' అని పిలువ్‌'' అంటా రు. ఆయనతో నాకు బాగా సింగ్ అయింది. ఆయన చాలా డిసిప్లిన్ గా, పంక్చువాలిటీతో ఉంటారు. నేను పని విషయంలో డిసిప్లిన్డ్‌గా ఉంటా....అందువల్ల ఆయనతో బాగా సింక్‌ అయింది అని పూరి తెలిపారు.

  చెడు తప్ప మంచి ఎవరూ చెప్పరు

  చెడు తప్ప మంచి ఎవరూ చెప్పరు

  బాలయ్య సెట్స్‌లో అందరితో చాలా జాలీగా ఉంటారు. రాగానే అందరినీ విష్ చేస్తారు. వెళ్లేపుడు అందరికీ బై చెప్పి వెళతారు. ఆయన గురించి చెప్పడానికి ఇలా చాలా విషయాలున్నాయి. కానీ వీటి గురించి ఎవరూ పట్టించుకోరు.... ఆయన ఎవర్నో కొట్టారనేది మాత్రం బాగా ప్రచారం చేస్తారు అని పూరి తెలిపారు.

  ఏమైనా అవుతుందేమో అనే భయం ఉండేది

  ఏమైనా అవుతుందేమో అనే భయం ఉండేది

  బాలయ్య చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఆయన యాక్షన్‌ సీన్లు చేసేప్పుడు మాత్రం భయపడేవాడ్ని. వెనుకా ముందూ చూసుకోకుండా దూకేస్తుంటారు. అలాంటప్పుడు ఆయనకు ఏమైనా అవుతుందేమోనని భయం ఉండేది అని పూరి చెప్పుకొచ్చారు.

  ఎవరికీ ఇబ్బంది ఉండకూదదనే

  ఎవరికీ ఇబ్బంది ఉండకూదదనే

  సినిమా 5 వారాల ముందు రిలీజ్ చేయడానికి కారణం... ఇతర సినిమాలకు ఇబ్బంది కలగకూడదని, తాము థియేటర్ల విషయంలో ఇబ్బంది పడకూడదనే. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.

  అంతా జై బాలయ్య మూడ్లో ఉన్నార

  అంతా జై బాలయ్య మూడ్లో ఉన్నార

  మొదటి మూడు రోజులూ కమర్షియల్‌గా సినిమా బాగుంది. బ్యాంకాక్‌లోనూ రిలీజయింది. ఇటీవలే ఫోన్‌ చేసి, వీడియో కాల్‌ మాట్లాడా. అక్కడి వాళ్లు సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారు. యు.ఎస్ఏలోని 24 రాష్ట్రాల్లో సినిమా రిలీజైంది. మాస్‌ ప్రేక్షకుల తరహాలో థియేటర్‌లో పేపర్లు ఎగరేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. బాలయ్యకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎలాంటిదో తెలిసింది. ఇప్పుడందరూ ‘జై బాలయ్య' మూడ్‌లో ఉన్నారు అని పూరి తెలిపారు.

  బాలయ్య 103 నాదే

  బాలయ్య 103 నాదే

  బాలకృష్ణగారితో వెంటనే ఇంకో సినిమా ప్లాన్‌ చేస్తున్నా. ఆయన 103వ సినిమాకు నేనే డైరెక్టర్‌ని. ‘పైసా వసూల్' షూటింగ్ సమయంలో బాలయ్యకు కథ చెప్పాను. ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఫైనల్ చేద్దామని నేను అంటే... రిజల్ట్ తో సంబంధం లేదు, మనం వెంటనే ఇంకో సినిమా చేస్తున్నాం, జనవరిలో షూటింగ్‌కు వెళ్తున్నాం'' అని బాలయ్య చెప్పారు అని పూరి తెలిపారు.

  ఆకాష్‌తో సినిమా

  ఆకాష్‌తో సినిమా

  బాలయ్య 102వ సినిమా చేస్తున్న గ్యాపులో మా అబ్బాయి ఆకాశ్‌తో ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాను అని పూరి తెలిపారు.

  చాలా సపోర్టు చేశారు.

  చాలా సపోర్టు చేశారు.

  డ్రగ్స్‌ వ్యవహారంలో ఒకరోజు ఎంక్వైరీకి పిలిస్తే వెళ్లి వచ్చాను. ఆ సమయంలో మీడియాలో వార్తలు చూసి నా కుటుంబం చాలా బాధ పడింది. ఆ టైమ్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచింది బాలకృష్ణగారే. నేను ఎంక్వైరీలో ఉండగా, నా భార్యతో, పిల్లలతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏ హీరో కూడా అలా చేయడు. ఆ విషయంలో ఆయనను ఎంత పొగిడినా తక్కువే అని పూరి అన్నారు.

  English summary
  Nandamuri balakrishna is going to work under Puri Jagannadh direction for his 103 movie. Puri Jagannadh confirms this news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X