బాలకృష్ణ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. మరో సర్‌ప్రైజ్ రెడీ!
జూన్ 10న నందమూరి బాలకృష్ణ 61వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న నందమూరి తెలుగు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఒకరోజు ముందుగానే అఖండ పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండింగ్ లిస్టులోకి చేరిపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అఖండలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు క్లారిటిగా అర్ధమయ్యింది. ముందు అఘోరా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. బుధవారం క్లాస్ గా ఉన్న స్టైలిష్ లుక్కును కూడా విడుదల చేశారు. ఇక అభిమానులకు బాలయ్య 107వ సినిమా సర్‌ప్రైజ్ కూడా రెడీ చేసినట్లు క్లారిటీ వచ్చేసింది. బాలకృష్ణ అఖండ అనంతరం గోపిచంద్ మలినేనితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ కథను రెడీ చేసుకున్న గోపిచంద్ క్రాక్ తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సీన్స్ రాసిన్నట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్కనున్న ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ సర్‌ప్రైజ్‌ను గురువారం ఉదయం 8:45గంటలకు అందించనున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించనున్నట్లు టాక్ వచ్చింది. గోపీచంద్ మలినేని మాస్ ప్రేక్షకులకు నచ్చేలా మరోసారి ఫుల్ మీల్స్ లాంటి సినిమాతోనే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి బాలకృష్ణ ఈ సినిమాతో తన మార్కెట్ ను ఎంతవరకు పెంచుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











