»   »  నేను..శాతకర్ణి ఒకేలా ఉంటాం, నచ్చకపోతే అంతే: బాలయ్య

నేను..శాతకర్ణి ఒకేలా ఉంటాం, నచ్చకపోతే అంతే: బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా..... తనకు, గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్న పోలికల గురించి చెప్పుకొచ్చారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని బాలయ్య చెప్పారు.

'నాకూ శాత‌క‌ర్ణికి చాలా పోలిక‌లున్నాయి. అనుకున్న‌ది చేయ‌డ‌మే మాకు తెలుసు. ఆశ‌యం, ఆవేశం ఉన్న‌వాడు శాత‌క‌ర్ణి. నేనూ అంతే. ఎందుకంటే ఆశ‌యం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేనివాడు మ‌నిషి కాడు. నాకు నేను న‌చ్చ‌క‌పోయినా ఇంకొక‌డికి న‌చ్చేలా ఉంటే ఫ‌లితం ఉండ‌దు. ఈ విష‌యంలో నేనూ, శాత‌క‌ర్ణి ఒకేలా ఉంటాం' అని బాలయ్య చెప్పుకొచ్చారు.

1973లో మా నాన్న‌గారు నా నుదుట తిల‌కం దిద్దారు. దాదాపు 43 ఏళ్లు అప్ర‌తిహ‌తంగా సాగుతున్నా. 99 సినిమాలు చేస్తే 71 శ‌త‌దినోత్స‌వాల‌ను జ‌రుపుకున్నాయి. మా త‌ల్లిదండ్రుల దీవెన‌, నా ఆత్మ‌బ‌లం, అభిమానుల అభిమాన‌మే ఇంత‌టికీ కార‌ణం. నా ఈ ప్ర‌యాణంలో ఎంతో మంది నాతో పాటు న‌డిచారు. మా నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు, హీరోయిన్ల‌కు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. తెలుగువారంద‌రికీ ఈ 100వ చిత్రం అంకితం. త‌ల్లులంద‌రికీ ఈ సినిమా అంకితం అన్నారు.

Balakrishna about Gautamiputra Satakarni

అనుకోవ‌డానికి ఇది 100వ సినిమా కావ‌చ్చు. ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు చేసిన నాకు కాక‌తాళీయంగానో, యాదృచ్ఛికంగానో ఈ క‌థ వ‌చ్చింది. విన‌గానే న‌చ్చింది. ఎప్పుడైనా కొత్త‌దాన్ని ఆస్వాదించే త‌త్వం నాకు నాన్న‌గారి నుంచి అల‌వాటైంది. ఆయ‌న వార‌సుడిగా వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టించాల‌న్న‌ది నా త‌ప‌న‌. తెలుగు శ‌కం మొద‌లైంది గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితోనే. మ‌న‌కున్న‌ది రెండు కాల‌మానాలు. ఒక‌టి క్రీస్తు కాల‌మానం. రెండోది శాత‌వాహ‌న శ‌కం.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అనేది చాలా మందికి తెలియ‌ని పాత్ర‌. కోటిలింగాలు ఆయ‌న‌కు త‌ల్లిగారి ఊరు. అమ‌రావ‌తిని పాలించారు. అమ‌రావ‌తిలో బౌద్ధ‌వాజ్ఞ‌యానికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. నాగార్జునుడు తిరిగిన నేల అది. 33 మంది రాజులను ఓడించిన చ‌క్ర‌వ‌ర్తి శాత‌క‌ర్ణి. మేం ఈ సినిమా కోసం చాలా క‌స‌ర‌త్తులు చేస్తున్నాం. ఎంతోమంది ప్ర‌ముఖుల‌ను సంప్ర‌తిస్తున్నాం. ఇంకా క‌థ గురించి చ‌ర్చిస్తున్నారు అని బాలయ్య తెలిపారు.

English summary
Balakrishna comments about his upcoming film Gautamiputra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu