»   » ఆ సినిమాలో నాతో మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడు: బాలయ్య

ఆ సినిమాలో నాతో మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడు: బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ 100వ సినిమా, ఆయన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కొంత కాలంగా హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య మీడియాకు ఎదురు పడగా ఈ విషయాలపైమై స్పందించారు. తన 100వ సినిమాపై అమావాస్య వెళ్లిన తరువాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య షాకింగ్ కామెంట్స్!

కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు, క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు రెడీగా ఉన్నాయని, ఏది ఫైనల్ అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అయితే రెండు సినిమాలనూ తానే చేస్తానని, ఒకటి ముందు, ఒకటి తరువాత అవుతుందని తెలిపారు. దీంతో పాటు ఆదిత్య 369 సీక్వెల్ కూడా చేస్తానని తెలిపారు.

తన కొడుకు అఖిల్ కాకూడదనే బాలయ్య అలా అన్నారా?

Balakrishna about Mokshagna

సింగితం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ చేస్తున్నాను. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఈ చిత్రంలో తనతో పాటు మరో ప్రధాన పాత్రలో మోక్షజ్ఞ నటిస్తాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని బాలయ్య మీడియా ముఖంగా స్పష్టం చేసారు.

సాయి కొర్రపాటి నిర్మాతగా...
బాలయ్య వందో సినిమాను 'లెజెండ్' సినిమా తీసిన 14 రీల్స్ - వారాహి చలనచిత్రం బేనర్లు సంయుక్తంగా నిర్మిస్తాయని సాయి కొర్రపాటి ఇటీవల వెల్లడించారు. రు. బాలయ్య కొడుకును తమ సంస్థ ద్వారానే హీరోగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. అయితే మోక్షు ఎంట్రీ ఎప్పుడన్నది కరెక్టుగా చెప్పలేనని అన్నాడు.

English summary
Actor Balakrishna's son Mokshagna will be played as guest role in Balakrishna's sequel movie Aditya 369.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu