»   » కళ్యాణం...కమనీయం! (బాలయ్య కూతురు పెళ్లి పిక్చర్స్)

కళ్యాణం...కమనీయం! (బాలయ్య కూతురు పెళ్లి పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జీవితం లొ ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం...మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం..బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం.

తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్న రెండో కూతురు తేజస్విని వివాహం కేంద్ర మంత్రి కావూరి మనవడు శ్రీభరత్‌తో హైదరాబాద్ ఐటెక్స్‌లో బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధమహారథులు ఈ వివాహ మహోత్సవానికి హాజయ్యారు.

బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో తేజస్విని-శ్రీభరత్ హిందూ సాంప్రదాయ బద్దంగా ఒక్కటయ్యారు. ముఖ్యంగా కీలకమైన మూడు ముళ్ల మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత జరిగిన తలంబ్రాల ఘట్టంలో వధూ వరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వివరాలు...అందకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ సోలో చూద్దాం...

తలంబ్రాలు

తలంబ్రాలు

బాలయ్య కూతురు తేజస్విని-శ్రీభరత్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వదూవరుల తలంబ్రాల దృశ్యాన్ని ఇక్కడున్న దృశ్యంలో చూడొచ్చు. పెళ్లి వేడుకలో తేజస్విని, శ్రీభరత్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

మంగళ్య ధారణ

మంగళ్య ధారణ

వివాహ వేడుకలో అతి ముఖ్యమైన ఘట్టం మాంగళ్య ధారణ. మూడు ముళ్లు పడిన తర్వాత వధూవరులు శాస్త్రోక్తంగా ఒక్కటైనట్లే. హిందూ సాంప్రదాయ బద్దంగా తెలుగువారి స్టైల్‌లో బాలయ్య కూతురు తేజస్విని-శ్రీభరత్ వివాహం జరిగింది.

మధుర జ్ఞాపకం

మధుర జ్ఞాపకం

జీవితం లొ ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం...మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం..బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం.

అసాధారణమైన అనుభూతి

అసాధారణమైన అనుభూతి

కళ్యాణం! అనే పదంలో ఎంతో మధురంగా వుంటుంది. ప్రతీ మనిషి జీవితంలోను ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానికంతటికీ మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్బ్జుత క్షణం ఒక అసాధరణమైన, అనుభూతి.

మనిషి జీవితానికి పరిపూర్ణత

మనిషి జీవితానికి పరిపూర్ణత

ఈకళ్యాణ్ ఘఢియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. భాద్యత యుతమైన పౌరుడిగా కుటుంబంలోను, అటు సంఘములోను కూడా ఒక గుర్తింపును కలగ జేసేది కళ్యాణమే!

అదే పరమార్థం

అదే పరమార్థం

ఎన్నెన్నో సుఖాలు, కష్త్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటిని ఒకరికొకరు సమానంగా పంచుకిని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణంవెనుక ఉన్న పరమార్హ్దం. ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక ఉన్న అర్ధమూ ఇదే!

సెలబ్రిటీల సందడి

సెలబ్రిటీల సందడి

బాలయ్య కూతురు తేజస్విని పెళ్లి వేడుకను పురస్కరించుకుని తెలుగు సినిమా కుటుంబానికి చెందిన వారంతా హాజరై సందడి చేసారు. తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.

భారీగా ఏర్పాట్లు

భారీగా ఏర్పాట్లు

తేజస్విని-శ్రీభరత్‌ల వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అందుకు తగిన విధంగా భారీ గా ఏర్పాట్లు చేసారు.

వెరైటీలతో విందు

వెరైటీలతో విందు

ఈ వివాహానికి వచ్చిన వారికి బాలకృష్ణ అద్బుతమైన రీతిలో ..వివధ రకాల స్పెషాలిటిలతో విందు ఏర్పాటు చేసారు. ఉదయం పూట కావటంతో వచ్చిన అతిధులకు వివిధ రకాలైన అల్పాహారాలు అందచేసారు. ఫైవ్ స్టార్ హోటల్ రేంజిలో ఈ ఐటమ్స్ ఉన్నాయి.

సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు

సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు

ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానుల రాకతో సందడి నెలకొంది. వివాహ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జైపాల్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, 'ఈనాడు' ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, తేదేపా నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అంబికాకృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, భాజపా నేత బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. అలాగే సినీనటులు మోహన్‌బాబు, మంచు మనోజ్‌, లక్ష్మి, దాసరి నారాయణరావు, వెంకటేష్‌, గోపీచంద్‌, మురళీమోహన్‌, పరుచూరి బ్రదర్స్‌, జయసుధ, రాఘవేంద్రరావు, రామానాయుడు తదితరులు హాజరయ్యారు.

తేజస్విని-శ్రీభరత్

తేజస్విని-శ్రీభరత్

నందమూరి కుటుంబంలో ఇప్పటి వరకు జరిగిన వివాహాల్లో తేజస్విని, శ్రీభరత్ వివాహమే అత్యంత ఘనంగా జరిగిందని చెబుతున్నారు. ఈమరి ఈ వివాహ వేడుకలో ఏర్పాట్లు ఓ రేంజిలో ఉన్నాయి.

పురంధరేశ్వరి

పురంధరేశ్వరి

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి తన సోదరుడు బాలయ్యకు, మేనకోడలు తేజస్వినికి సాంప్రదాయ బద్దంగా శాస్త్రోక్తంగా చేయాల్సినవి చేసారు.

నారా బ్రాహ్మణి సందడి

నారా బ్రాహ్మణి సందడి

పెళ్లి వేడుకలో వధువు తేజస్విని అక్కయ్య నారా బ్రహ్మాణి బ్రహ్మణి చేసిన సందడి అంతాఇంతాకాదు. అందరినీ పలకరిస్తూ....పెళ్లి వేడుకలో తన చేతుల మీదుగా జరుగాల్సిన బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నారు.

అంగుళీకం

అంగుళీకం

వధువు తేజస్విని, వరుడు శ్రీభరత్ చేతికి ఉంగరం పెడుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

English summary
Nandamuri Balakrishna's second daughter Tejaswini has tied the knot with GITAM founder MVVS Murthy's grandson Sribharat at a star-studded wedding ceremony held at Hitex in Madhapur, Hyderabad this morning (August 21).
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu