For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda: ఆస్ట్రేలియాలో ఆగిపోయిన సినిమా.. థియేటర్‌లో బాలయ్య ఫ్యాన్స్‌కు పోలీసుల వార్నింగ్

  |

  చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి కచ్చితంగా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నారు. ఇందుకోసం గతంలో తనకు రెండు భారీ సక్సెస్‌లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టారు. ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన చిత్రమే 'అఖండ'.

  ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నేడే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఈ సినిమాను ఆపేశారు. అంతేకాదు, పోలీసులు ఎంట్రీ ఇచ్చి బాలయ్య ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

  ‘అఖండ'గా వచ్చేసిన బాలయ్య

  ‘అఖండ'గా వచ్చేసిన బాలయ్య

  నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. సింహా, లెజెండ్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఇది నేడే విడుదల అయింది.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  భారీ బిజినెస్.. గ్రాండ్‌గా విడుదల

  భారీ బిజినెస్.. గ్రాండ్‌గా విడుదల

  'అఖండ' మూవీకి దాదాపు రూ. 53 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లో రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. అన్ని ప్రాంతాలను కలుపుకుని దీన్ని దాదాపు 1600లకు పైగా థియేటర్లలో తీసుకొచ్చారు. సెకెండ్ వేవ్ తర్వాత ఇది భారీ రిలీజ్ అన్న విషయం తెలిసిందే.

  పాజిటివ్ రివ్యూ.. సూపర్ హిట్ టాక్

  పాజిటివ్ రివ్యూ.. సూపర్ హిట్ టాక్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'అఖండ' మూవీకి ప్రీమియర్ షోల నుంచే భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫ్యాన్స్ కోలాహలం నడుమ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. దీనికితోడు విమర్శకుల నుంచి ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

  Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

  ఆ దేశాల్లో కూడా వచ్చిన సినిమా

  నందమూరి బాలకృష్ణకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'అఖండ' మూవీని అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పలు సినిమాల్లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రదర్శితం అయ్యే థియేటర్లు కళకళలాడిపోయాయి. ఫ్యాన్స్ హంగామాతో మోత మోగిపోయాయి. దీంతో బాలయ్య స్టామినా మరోసారి నిరూపణ అయింది.

  ఆస్ట్రేలియాలో ఆగిన ‘అఖండ'

  ఆస్ట్రేలియాలో ఆగిన ‘అఖండ'

  అమెరికాలోనే కాదు.. 'అఖండ' మూవీ ఆస్ట్రేలియాలో కూడా చాలా స్క్రీన్స్‌లో విడుదలైంది. మరీ ముఖ్యంగా బ్రిస్బేన్‌లో సైతం పలు స్క్రీన్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ప్రీమియర్స్ నుంచే ఆయా థియేటర్లలో అభిమానులు రచ్చ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిస్బేన్‌లోని ఓ స్క్రీన్‌లో 'అఖండ' సినిమాను ఆపేసి పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
  ఫ్యాన్స్‌కు పోలీసులు వార్నింగ్

  ఫ్యాన్స్‌కు పోలీసులు వార్నింగ్

  బ్రిస్బేన్‌లో 'అఖండ' సినిమా ప్రదర్శన అవుతోన్న ఓ థియేటర్‌లో నందమూరి అభిమానులు కేరింతలో రచ్చ రచ్చ చేశారు. అప్పుడు థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సినిమాను కాపేపు ఆపేశారు. అంతేకాదు, ఇకపై అలా రచ్చ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

  English summary
  Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. Now This Movie Show Paused in Brisbane with Fans Excitement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X