»   »  జూనియర్ పై మరో దాడికి సిద్దమవుతున్న బాలయ్య అభిమానులు

జూనియర్ పై మరో దాడికి సిద్దమవుతున్న బాలయ్య అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఎన్నేళ్లు వచ్చినా, ఎన్నితరాలు మారినా, తమ తరం హీరోలకు ఇన్స్‌పిరేషన్ చిరంజీవి" ఇవే మాటలు వేరే ఏ హీరో చెప్పినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అదీ నిజమే అన్నట్టుగా సర్దుకు పోయే వారు. అయితే మా అవార్డ్స్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలు చెప్పటం. నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మా టివి అవార్డ్స్ ఫంక్షన్‌ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల పై అప్పుడే బాలకృష్ణ అభిమానులు పెనుదుమారం సృష్టిస్తున్నారు చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా "టెంపర్" చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న తరువాత అనుకోకుండా జూనియర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయి.

చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్న వెంటనే తమ తరం హీరోలకు ఇన్స్‌పిరేషన్ చిరంజీవి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు ఎంటీఆర్. చిరంజీవి పేరు జూనియర్ నోటి వెంటరాగానే అభిమానుల కేకలు ఈలలతో మా అవార్డ్స్ ఫంక్షన్ ప్రాంగణం అదిరి పోయింది. నందమూరి అభిమానులకు మాత్రం జూనియర్ మాటలు మింగుడు పడలేదు. అయితే వెంటనే సర్దుకుని బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ పేర్లను చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది.

Balakrishna Fans fire on jr NTR

అయితే అసలు పేర్లను వదిలేసి మొదట చిరంజీవి పేరు చెప్పడం ఏమిటని బాలయ్య అభిమానులు జూనియర్ మాటల పై మండి పడుతున్నారు. ఏ వంశం పేరు చెప్పుకోనైతే పైకొచ్చాడో ఆ తాత గారి పేరు మర్చిపోయాడా అంటూ అంటూ సొషల్ మీడియా లో రెచ్చిపోయారు.

అయితే ఇప్పటికింకా పూర్తి స్థాయిలో బాలయ్య అభిమానులు స్పందించలేదు. ఎందుకంటే ముందు గా స్టేజీ‌పై వున్నవారికి గౌరవం ఇవ్వడం సంప్రదాయం కాబట్టి చిరంజీవి పేరు ముందుగా చెప్పి ఉంటాడు అన్న వాదనలోనూ కొంత నిజం ఉండటమే. నిజానికి ముందుగా అవార్డ్ ఇచ్చిన వారిని మొహమాటానికైనా ముందు గా పొగడాల్సి వస్తుంది.

అందులోనూ ఎన్టీఆర్ చెప్పినదాన్లో కూడా అబద్దం ఏమీ లేదు. జూనియర్ తరం లో ఉన్న చాలా మంది హీరోలు చిరు తమ ఇన్స్పిరేషన్ అని చాలా సంధర్భాల్లో చెప్పారు.అదే మాటని ఇప్పుడు ఎన్ టీ ఆర్ మళ్ళీ ఒక సారి గుర్తు చేసాడు. అని వెనకేసుకు వస్తున్న వారూ ఉన్నారు.

అయితే ఈ కామెంట్స్ విన్న బాలయ్య అభిమానులు మాత్రం ఈ మాటలతో ససేమిరా ఒప్పుకోవటం లేదు, తాతయ్యా,బాబాయ్ అంటూ వారి అభిమానులతో నే తన ఫాలోయింగ్ పెంచుకున్న జూనియర్.... ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మీద కూడా అదే ప్రయోగం చేస్తున్నాడా అంటూ... సెటైర్లు వేస్తున్నారు....

English summary
Balakrishna Fans fire on jr NTR about his words about chiranjeevi that "chiranjeevi is our inspiration"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu