బాలయ్య కొట్టినా అభిమానం తగ్గదు: ‘పైసా వసూల్’ థియేటర్ వద్ద ఫ్యాన్స్ పోస్టర్లు
బాలయ్య ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు హాట్ టాపిక్ అయ్యాయి.ఆయన మాపై చేయి చేసుకున్నా అభిమానం తగ్గదని పేర్కొన్నారు. అమ్మ కొట్టినా, బాలయ్య కొట్టినా బాధపడం అని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనతో ఫోటో దిగడానికి వచ్చిన అభిమానులపై ఆయన రెండు మూడు సందర్భాల్లో చేయి చేసుకున్నారు. బాలయ్య తీరుపై చాలా విమర్శలు వచ్చాయి.
అయితే ఈ ఘటనలపై అభిమానులు వెరైటీగా స్పందించారు. 'పైసా వసూల్' సినిమా విడుదల సందర్భంగా ఈ సంఘటనలను గుర్తు చేస్తూ బాలయ్యకు మద్దతుగా పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లు ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

కొట్టినా అభిమానం తగ్గదు
‘అమ్మ తిట్టిందని అమ్మ మీద ప్రేమ.. బాలయ్య బాబు తిట్టాడని ఆయన మీద అభిమానం ఎప్పటికీ చెరిగిపోవు.. జై బాలయ్య.. జై జై బాలయ్య' అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానులు బాలయ్యపై అభిమానం చాటుకున్నారు.

పూరి సపోర్టు
ఆ మధ్య ఖమ్మంలో జరిగిన ‘పైసా వసూల్' వేడుకలో దర్శకుడు పూరి స్పందిస్తూ..... వేరే హీరోలు బయటకు వెళితే బౌన్సర్లు కావాలేమో? బాలయ్యకు అక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్‌ను ఆయనే కంట్రోల్ చేసుకోగలరు. ఒక్కొక్కళ్లు మీద పడుతుంటే ఆయన కొడుతుంటారు. ఆలా కొట్టడం అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. హ్యాపీగా ఫీలవుతుంటారు... అని పూరి వ్యాఖ్యానించారు.

ప్రేమతో కొడతారు
ఇవాళ మీడియాలో బాలయ్య బాబు ఎవరినో కొట్టాడని అంటున్నారు. అసలు మీడియా వారికి ఏం తెలుసు బాలయ్య కొట్టడాన్ని వాళ్లు ఎంత ఎంజాయ్ చేస్తారో? ఆయన ఎప్పుడైనా కొడితే కామన్ సెన్స్ అనే ఏరియా తేడా వస్తేనే కొడతారు. బాలయ్య బాబు ఎవరినైనా కొడితే గుర్తు పెట్టుకోండి అదో లవ్ స్టోరీ. డోంట్ టేక్ సీరియస్.... అంటూ పూరి బాలయ్య చర్యను సమర్ధించారు.

జై బాలయ్య
‘పైసా వసూల్' సినిమా తొలిరోజు అభిమానులు పోటెత్తారు. ఈ సినిమాలో ‘కోకా కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ..... జై బాలయ్య జైజై బాలయ్య' అనే పాట ఉండటం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. థియేటర్లన్నీ జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లాయి.


Click it and Unblock the Notifications











