»   » తన కొడుకు అఖిల్ కాకూడదనే బాలయ్య అలా అన్నారా?

తన కొడుకు అఖిల్ కాకూడదనే బాలయ్య అలా అన్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞ తెరంగ్రేటం గురించి వెల్లడించారు. అయితే మోక్షన్ తొలి సినిమా విషయంలో భారీ ఆర్భాటాలకు పోవాలని అనుకోవడం లేదు. ప్రారంభంలో సినిమాలు మామూలుగానే.... వీడు మనబ్బాయి అనే విధంగా ప్రేక్షకులు ఫీలయ్యేలా ఉండాలి. ప్రపంచాన్ని కాపాడేసాడు అలాంటి సూపర్ హీరో పాత్రలు వద్దు. ముందు మామూలు సినిమాలతో ప్రేక్షకుల అభిమానం చూరగొంటే...మాస్ ఫాలోయింగ్ అదే వస్తుంది అన్నారు బాలయ్య.

తొలి సినిమాకే ప్రపంచాన్ని కాపాడేసాడు లాంటి పాత్రలు వద్దు అని బాలయ్య కామెంట్ చేయడం వెనక.... ఇటీవల విడుదలై అఖిల్ సినిమాను ఉద్దేశించే అని అంటున్నారంతా. అఖిల్ తన తొలి సినిమాకే ప్రపంచాన్ని కాపాసాడు అనే పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే వయసుకు మించిన పాత్ర చేసిన అఖిల్ తొలి సినిమాకే భారీగా దెబ్బతిన్నాడు. అఖిల్ లా తన కొడుకు కాకూడదనే బాలయ్య అలా మాట్లాడారని టాక్.

Balakrishna indirect comments about Akhil

బాలయ్య 100వ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘డిక్టేటర్' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. 100వ సినిమాలో మోక్షజ్ఞను తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అప్పటికీ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను అన్నారు బాలయ్య.

ప్రస్తుతం బాలయ్య మోక్షజ్ఞ సినిమా కోసం పలువురు దర్శకులు తెస్తున్న స్క్రిప్టులు వింటున్నారట. మోక్షజ్ఞ తొలి సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలని బాలయ్య కోరుకుంటున్నారు. అలాంటి కథల కోసమే ఎదురు చూస్తున్నారు.

English summary
Nandamuri Balakrishna had said “My son would only act in normal boy-next door kind of movies in his start. Only in his later movies would he save the world”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu