»   » ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేసాడు, బాలయ్యే లాంచ్ చేస్తున్నాడు!

ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేసాడు, బాలయ్యే లాంచ్ చేస్తున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఆడియో రిలీజ్ ఈ నెల 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య చేతుల మీదుగానే ఆడియో విడుదలవుతుందని తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసారని, ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్టుగా హాజరవ్వాలని, ఆడియో లాంచ్ చేయాలని కోరానని.... బాలయ్య నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ 25న ఆడియోను రిలీజ్‌ చేయనున్నారు. అలాగే జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ కూడా అదే స్పీడుతో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం ఉత్తరాంధ్ర, వైజాగ్ రైట్స్ ని విబిఎమ్ రెడ్డి ఫిలిమ్స్ వారు సొంతం చేసుకున్నారు. నిన్నే ఈ డీల్ ఫైనల్ అయ్యింది. నాన్ రిఫండబుల్ ఎడ్వాన్స్ పద్దతిలో విబిఎన్ రెడ్డి ఫిల్మ్స్ వారు తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

Balakrishna to launch 'Nannaku Prematho' songs

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూర్చారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే జరిగింది. 60 రోజులపాటు లండన్‌లో షూటింగ్ జరిగింది. తర్వాత స్పెయిన్ లోని రేర్ లొకేషన్లలో షూటింగ్ జరిపారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
It's time to rejoice for all the Balakrishna and NTR fans. If the buzz in the tinsel town is anything to go by, Balakrishna is going to grace the audio launch of NTR's upcoming movie Nannaku Prematho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu