twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ డైలాగ్ చెప్తే అదే నిజమైంది

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా కోసం బాలకృష్ణ చెప్పిన నిజ జీవితంలో నిజమైందంటూ అభిమానులు సంతోషపడుతున్నారు. ఈ మేరకు వారు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఆ డైలాగుని పోస్ట్ చేసి మురిసి పోతున్నారు. రీసెంట్ గా లెజండ్ తో హిట్ కొట్టిన బాలకృష్ణ.. హిందు పురంలో సైతం ఎలక్షన్స్ లో పోటీ చేసి విజయం సాధించి ప్రస్తుతం విజియోత్సవ యాత్ర చేస్తూ బిజీగా ఉన్నారు.

    ఇంతకీ ఆ డైలాగు ఏమిటీ అంటారా...'స్టేట్‌ అయినా ...సెంటరైనా, పొజిషన్‌ అయినా... అపోజిషన్‌ అయినా.. నేను దిగనంత వరకే. వన్స్‌ ఐ స్టెప్‌ ఇన్‌, హిస్టరీ రిపీట్స్‌...' . ఈ డైలాగులో ఉన్నట్లే ...ఈ సారి ఎలక్షన్స్ లో బాలకృష్ణ దిగాడని, తెలుగుదేశం హిస్టరీ రిపీట్ అయ్యిందని అంటున్నారు. బాలయ్య సైతం ఇదే విషయాన్ని గెలిచిన తర్వాత స్పష్టం చేసి గుర్తు చేసారు.

    Balakrishna LEGEND Dialogue came true

    హిందూపురం నుంచి 16వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన బాలయ్య... మీడియాతో మాట్లాడుతూ....తాను సింహా చిత్రంలో వైద్యుడి వేషం వేయగా... అనూహ్యంగా బసవతారకం ఆసుపత్రి ట్రస్టు బాధ్యతలు చూసే అవకాశం దక్కిందన్నారు. ఇప్పుడు లెజెండ్‌ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రను పోషించగా, అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలుపొందడం యాదృచ్ఛికమన్నారు. ''సెంట్రల్‌ అయినా.. స్టేట్‌ అయినా.. పొజిషన్‌ అయినా.. అపోజిషన్‌ అయినా.. హిస్టరీ రిపీట్‌'' అంటూ లెజెండ్‌ చిత్రంలోని డైలాగ్‌ పలికిన బాలయ్య, తాము చరిత్ర సృష్టించినట్లు ప్రకటించారు.

    నందమూరి బాలకృష్ణ 'లెజెండ్‌' చిత్రంతో. బాలకృష్ణని ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. 'సింహ' కలయికలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర విజయ ఢంకా మోగించింది. రెండు పాత్రల్లో బాలయ్య నటన, కథ కథనాల్లో వేగం, దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని అందించాయి. సోనాల్‌ చౌహాన్‌, రాధికా ఆప్టే కథానాయికలు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. 14 రీల్స్‌, వారాహి చలన చిత్రం సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. సాయి కొర్రపాటి సమర్పించారు. 'లెజెండ్‌' దాదాపు వంద కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకొంటోంది.

    దర్శకుడు మాట్లాడుతూ ''అభిమానులకే కాదు.. ఇంటిల్లిపాదికీ నచ్చాలనే ఈ సినిమా తీశాం. మా ప్రయత్నం విజయవంతమైంది. పెద్ద సినిమా అనేసరికి వందలాది కేంద్రాల్లో విడుదల చేస్తున్నాం. అందుకే రెండోవారానికి వసూళ్లు ఉండడం లేదు. యాభై రోజుల పోస్టర్లు కనిపించడం లేదు. ఇలాంటి వాతావరణంలోనూ.. 'లెజెండ్‌' రికార్డు వసూళ్లతో అర్ధ సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని.. ప్రేక్షకులే నిలబెట్టారు. ఇలాంటి నిర్మాతలు దొరికారు కాబట్టే నాణ్యత విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించగలిగాను. ఈ విజయం మా అందరిదీ'' అన్నారు.

    English summary
    All the dialogues in Legend are quickly getting connected to some real life politicians though Balayya and Boyapati claimed that they are written only for the sake of screen. These dialogues help Balayya a lot for his political ambitions and indirectly acts as promotional-video for him and Telugudesam party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X