»   » భయపెట్టాడు కానీ, ఇపుడు రొమాంటిక్ బాలయ్య (ఫోటో)

భయపెట్టాడు కానీ, ఇపుడు రొమాంటిక్ బాలయ్య (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం 'లెజండ్'. ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అందులో బాలయ్య తుపాకులు పట్టుకుని భయపెట్టే లుక్‌లో కనిపించాడు. అయితే తాజాగా విడుదలైన మరో ఫోటోలో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు బాలయ్య.

14రీల్స్‌ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్‌'. దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఆడియో మార్చి 7న శిల్పకళా వేదికలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిత్రం ఫస్ట్ టీజర్‌ని కూడా అతి త్వరలో లాంచ్ చేస్తారు. అలాగే మార్చి 28న గానీ, లేదంటే ఏప్రిల్‌ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు ఐటం సాంగు చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు ఈ చిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దాదాపు నలభై కోట్ల వరకూ ఈ చిత్రంపై పెట్టుబడి పెడుతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

English summary
Legend directed by Boyapati Srinu and produced by Ram Achanta, Gopichand Achanta and Anil Sunkara under 14 Reels Entertainment and Sai Korrapati will be presenting the film on Vaarahi Chalana Chitram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu