»   » కుట్రపన్ని 'లెజెండ్' చిత్రం పైరసీ

కుట్రపన్ని 'లెజెండ్' చిత్రం పైరసీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న 'లెజెండ్' సినిమా వెబ్‌సైట్‌లో హల్‌చల్ చేస్తూ షాక్ ఇస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన లెజెండ్ సినిమా పైరసీ భారిన పడింది. దీంతో బాలయ్యబాబు అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఇలా పైరసీ భారిన పడడం దురదృష్టకరమని, కేవలం కొంతమంది కుట్రపన్ని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎవరూ కూడా పైరసీని ప్రొత్సహించవద్దని, లెజెండ్ చిత్రాన్ని థియేటర్‌లోనే చూడాలని బాలయ్య అభిమానులు విజ్ఞప్తి చేశారు.

Balakrishna Legend Movie Piracy Out

మరోవైపు లెజెండ్ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి ఉత్తరాంధ్రలో విజయోత్సవ ర్యాలీను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుంటూరు చేరుకన్న బాలయ్యకు అభిమానులు లెజెండ్ సినిమా పైరసీ విషయాన్ని ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేశారు.

విషయం తెలుసుకున్న బాలయ్య వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చిత్ర నిర్మాతలను, పోలీసులను కోరారు. విడుదలైన మొదటి రోజు నుంచి రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సమయంలో లెజెండ్ సినిమా పైరసీ భూతం భారిన పడడం బాలయ్య అభిమానుల్లోనే కాదు, నిర్మాతలకు తలనొప్పిగా మారింది. సినిమా పైరసీలను ప్రోత్సాహించవద్దని, ధియేటర్‌కు వెళ్ళే సినిమా చూడలని సినీ ప్రియులకు నిర్మాత, అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వీలైనంత త్వరగా నిందుతులను పట్టుకోవాలని బాలయ్య బాబు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ చిత్రం పైరసీ మీకు కనపడితే..ఈ ఈమెయిల్ ఐడికి ఆ లింక్ పార్వర్డ్ చేయండి..వారిపై చర్యలు తీసుకుంటారు..
మెయిల్ ఐడీ: antipiracy@14reels.net

English summary
Nandamuri Balakrishna's Legend Anti Piracy Note from Producers- Report Legend Piracy Please mail the any piracy activity to antipiracy14reels.net
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu