»   » బాలయ్య ‘పరమవీర చక్ర’లో ఆ రెండు పాత్రలమద్య సీక్రెంట్ ఏంటీ....

బాలయ్య ‘పరమవీర చక్ర’లో ఆ రెండు పాత్రలమద్య సీక్రెంట్ ఏంటీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా లెజెండ్రీ డైరెక్ట్ దాసరి నారయణ రావు దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'పరమవీర చక్ర". దర్శకుడిగా ఈ చిత్రం ఆయనకు 150వ చిత్రం. ఈ చిత్రంలో బాలీవుడ్ బామలు అమీష పటేల్, నేహా దూపియా ప్రదాన పాత్ర ఫోషిస్తుండగా మరో ముఖ్య పాత్రలో షీలా నటించనుంది. ఈ చిత్రానికి నిర్మాత సి కళ్యాణ్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండూ విభిన్న మైన పాత్రలలో గల సంబందాన్ని స్ర్కీన్ మీద చూడాల్సిందే. బాలకృష్ణ సైనికాధికారిగా, సినీ హీరోగా ఆయన కనిపించబోతున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరింది. మరో మూడు పాటలతో సినమా షూటింగ్ పూర్తి చేసికొని సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంకా ఇందులో రాజ్ ప్రేమి, కోట శ్రీనివాస రావు, చలపతి రావు, విజయ్ కుమార్, మురళీ మోహన్ మరియు బ్రహ్మానందం మొదలగు వారు నటిస్తున్నారు..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu