»   » కళ్ళు చెదిరే దొంగా పోలీస్ ఆటకు సై అంటున్న బాలయ్య..డాన్ గా మారితే!

కళ్ళు చెదిరే దొంగా పోలీస్ ఆటకు సై అంటున్న బాలయ్య..డాన్ గా మారితే!

Subscribe to Filmibeat Telugu

బాలయ్య ఈ ఏడాది సంక్రాంతికి జైసింహా గా సందడి చేశాడు. జైసింహా చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. బాలయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలన్నింటిని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా బాలకృష్ణ మరో చిత్రానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కన్నడలో ఘనవిజయం సాధించిన 'మఫ్టీ' చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది.

అండర్ వరల్డ్ డాన్ మరియు ఓ పోలీస్ అధికారి మధ్య సాగే ఆసక్తికరమైన కథ ఇది. బాలయ్య అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించడానికి ఉవ్విళ్లూరుతున్నాడని, రీమేక్ చేయడానికి సంప్రదింపులు మొదలైనట్లు సమాచారం. కన్నడలో అండర్ వరల్డ్ డాన్ గా హీరో శివ రాజ్ కుమార్ నటించారు. పోలీస్ అధికారిగా శివ మురళి నటించడం విశేషం. ఈ తరహా పాత్రలు బాలయ్యకు సరిపోతాయి కనుక ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Balakrishna planning for Kannada remake
English summary
Balakrishna planning for Kannada remake. Mufti movie blockbuster in Kannada
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X