»   » బాలయ్య సినిమా మేకింగ్ వీడియో లీక్ చేసారు (వీడియో)

బాలయ్య సినిమా మేకింగ్ వీడియో లీక్ చేసారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లీక్..లీక్..లీక్... ఒకపక్క సినిమా రిలీజ్ కిముందే హీరో లుక్ బయటపడిపోకుండా దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటూంటే. ఇంకో పక్క సీన్లకు సీన్లే లీకైపోతున్నాయి. అసలు ఈ లీకు వీరులని ఎలా ఆపాలో కూడా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు మేకర్స్. గౌతమీపుత్ర శాతకర్ని సినిమా సమయం లోకూడా ఇలాగే బాలయ్య లుక్ ని సెట్ మీదనుండే లీక్ చేసేసారెవరో. అయితే అది కేవలం ఫొటో మాత్రమే కానీ ఇప్పుడు మాత్రం ఇంకో అడుగు ముందుకు వేసి మరీ ఏకంగా మేకింగ్ వీడియోనే నెట్లో పెట్టేసారు లీకు వీరులు.

ఉస్తాద్ అనే టైటిల్ తో వస్తుందనుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం విదేశాల్లో షూట్ జరుపుకుంటోంది. ఆ షూటింగ్‌కు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టేశాడు. ఈ వీడియో బిట్ షూటింగ్ స్పాట్ నుంచే లీకైనట్టు కనిపిస్తొంది. ఇందులో బాలయ్య సీన్ లో భాగంగా తన గాగుల్స్ ని కెమెరా వైపు విసిరేస్తాడు. రెడ్ టీషర్ట్ , గడ్దం తో బాలయ్య లుక్ సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ వీడియో అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. యూట్యూబ్‌లో అప్ లోడ్ అయ్యి సోషల్ మీడియాలోనూ వాట్సాప్ లోనూ ప్రస్తుతం తెగ షేర్ అవుతూ... వైరల్ అవుతున్న ఆ వీడియో.. హీరో బాలకృష్ణ.. హీరోయిన్‌తో గొడవపడే సన్నివేశంలా కనిపిస్తోంది. కాగా, మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్న బాలయ్య.. తొలిసారి పాటను కూడా పాడాడు.

English summary
A little video leaked from Hero Nandamuri Balakrishna's next With Puri Jagannath
Please Wait while comments are loading...