»   » కేసీఆర్ నోట 200 డేస్ మాట: బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంచ్ (ఫోటోస్)

కేసీఆర్ నోట 200 డేస్ మాట: బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంచ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖండ భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంలో పోషించబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. మహానటుడు, నటరత్న ఎన్టీయార్‌ పోషించాలనుకున్న ఈ పాత్రను ఆయన సమయాభావం కారణంగా కార్యరూపంలోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు తన తండ్రి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రంగా చేస్తుండటం విశేషం. ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ రాజధాని అమరావతిలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ గురించి బాలకృష్ణ ప్రకటించారు. తెలంగాణ రాజధానిలో రాజధాని హైదరాబాద్ లో ఈ రోజు సినిమాను లాంచనంగా సినిమాను ప్రారంభించారు.

తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలయ్యపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కేసీఆర్ క్లాప్ కొట్టారు. చిరంజీవి, వెంకటేష్ కెమెరా స్విచాన్ చేసారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు.

తనకు అత్యంత ఇష్టమైన మహానటుడు నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ వందో చిత్రం ప్రారంభోత్సవానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒక శకానికి నాంది పలికిన యుగపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి కథను వందో చిత్రంగా నిర్మించ తలపెట్టిన బాలకృష్ణను తెలుగువారంతా అభినందించాలన్నారు. ఈ చిత్రం కచ్చితంగా 200 రోజులు ఆడుతుందని ఆకాంక్షించారు.

తెలుగు ప్రజలందరూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూసి ఆయన చరిత్ర తెలుసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. మద్రాసీలుగా పిలవబడుతున్న తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కేసీఆర్‌ కొనియాడారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ను తమ ప్రభుత్వం తొలగించడానికి ప్రయత్నిస్తోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... తెలుగు జాతికి గర్వకారణమైన ఎన్టీఆర్‌ గుర్తులను తాము ఎన్నటికీ చెరపబోమన్నారు. ఎన్టీఆర్‌ కుమారుడైన బాలకృష్ణ వందో చిత్రం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

తెలుగుజాతికి గర్వకారణమైన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తన వందో సినిమాగా తెరకెక్కించడం తన అదృష్టమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు వేసిన తనకు ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కెరీర్‌ నుంచి తనను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారని.. వారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తానన్నారు. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసిన తన తండ్రి ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.

స్లైడ్ షోలో ఫోటోస్..

కేసీఆర్ క్లాప్

కేసీఆర్ క్లాప్


బాలయ్య పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కేసీఆర్ క్లాప్ కొట్టారు.

చిరు, వెంకీ, దాసరి

చిరు, వెంకీ, దాసరి


చిరంజీవి, వెంకటేష్ కెమెరా స్విచాన్ చేసారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు.

కేసీఆర్

కేసీఆర్


తనకు అత్యంత ఇష్టమైన మహానటుడు నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ వందో చిత్రం ప్రారంభోత్సవానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

అభినందన

అభినందన


ఒక శకానికి నాంది పలికిన యుగపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి కథను వందో చిత్రంగా నిర్మించ తలపెట్టిన బాలకృష్ణను తెలుగువారంతా అభినందించాలన్నారు.

200 డేస్

200 డేస్


ఈ చిత్రం కచ్చితంగా 200 రోజులు ఆడుతుందని ఆకాంక్షించారు.

దాసరి, చిరు

దాసరి, చిరు


బాలయ్య 100వ సినిమా ప్రారంభోత్సవంలో దాసరి, చిరు కరచాలనం.

నా అదృష్టం

నా అదృష్టం


తెలుగుజాతికి గర్వకారణమైన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తన వందో సినిమాగా తెరకెక్కించడం తన అదృష్టమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.

మైలురాయి

మైలురాయి


తన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు వేసిన తనకు ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు

అభిమానులకే

అభిమానులకే


కెరీర్‌ నుంచి తనను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారని.. వారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తానన్నారు.

తండ్రే స్పూర్తి

తండ్రే స్పూర్తి


పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసిన తన తండ్రి ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.

క్రిష్

క్రిష్


క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

English summary
Balakrishna's 100th film Gautamiputra Satakarni launched today at Annapoorna studios.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu