For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ మార్కెట్ లోకి బాలకృష్ణ

  By Srikanya
  |

  హైదరాబాద్ : మళయాలంలో కూడా భారీగా సినిమాలు రిలీజ్ చేసే తెలుగు హీరో అల్లు అర్జున్. ఇప్పుడు బాలయ్య కూడా మళయాళ మార్కెట్ లో కి ప్రవేశిస్తున్నారు. నందమూరి హీరో బాలకృష్ణ నటించన సినిమా డిక్టేటర్. శ్రీవాస్ డైరక్షన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మళయాలంకు కు సంబందించిన డబ్బింగ్ కూడా చాలా స్పీడుగా పూర్తవుతోంది.

  తెలుగుతో పాటే ఈ సినిమాను అదే టైంలో రిలీజ్ చెయ్యలని టీం ప్లాన్ చేసుకుంటోంది. వీటికి సంబందించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కూడా ఫాస్ట్ గా సాగుతున్నాయి.
  ఈ సినిమాకు నిన్న నిర్వహించాల్సినా ప్లాటినమ్ డిస్క్ వేడుకను చివరి నిమిషంలో వాయిదా వేసారు. వాయిదాకు కారణం ఎమిటనేది తెలియలేదు.

  ఈ కార్యాక్రమం యదాతదంగా హైదరాబాద్ లోని శిల్పా కళావేదిక పైనే ఈనెల 6న(బుదవారం) జరగనుంది. దీనిని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు నిర్మాణానంతర పనులు సైతం పూర్తయ్యాయి.

  సినిమా షూటింర్ పూర్తయిన సందర్భంగా ‘డిక్టేటర్‌' యూనిట్ హైదరాబాద్‌లో గుమ్మడికాయ పండుగ జరుపుకొంది. తెలుగు సినీ పరిశ్రమలో సినిమా పూర్తి అయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం అనేది ఆచారంగా జరుగుతు వుంది. దానిని ఈ టీం మిస్ కాకుండా పాటించింది.

  Balakrishna's Dictator in Malayalam too

  బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

  దర్శకుడు మాట్లాడుతూ...‘‘ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రానికీ మంచి స్పందన వస్తోంది. తమన్‌ మంచి బాణీలు అందించారు. బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో.. అంతకు మించి ఆయన పాత్రని తీర్చిదిద్దాం. ఈ నెల 14న ‘డిక్టేటర్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది'' అని తెలిపారు.

  బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 14 న సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూన్న, ఈ సినిమా సెన్సార్ కి ఈనెల 7 తారీకున వెళ్ళనుంది. కొద్దగా మిగిలివున్న ప్యాచ్ వర్క పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తపుతోంది. మరోపక్క పోస్ట్ ప్రోడక్షన్ పని కూడా వేగంగా జరుగుతోంది.

  మిగతా కీలకపాత్రల్లో ...ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

  English summary
  Nandamuri Balakrishna's Dictator makers are planning to release the movie simultaneously in Malayalam as well.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X