For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేశం మొత్తం ‘డిక్టేటర్‌’ గురించే...(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: ‘‘డిక్టేటర్‌' పేరులోనే ఓ శక్తి ఉంది. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకుంటోంది. మరీ ముఖ్యంగా కోట్లాది తెలుగువాళ్లు ఈ సినిమా గురించి ఆసక్తిగా చర్చించుకొంటున్నారు'' అన్నారు నందమూరి బాలకృష్ణ.

  ఆయన హీరోగా నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్‌'. శ్రీవాస్‌ దర్శకత్వం వహించారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆ ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

  అలాగే..‘‘నాకు తండ్రి గురువు దైవం... అన్నీ నాన్నగారే. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడానికి ఆయనే స్ఫూర్తి'' అంటూ బాలయ్య తన విజయానందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

  స్లైడ్ షో లో సక్సెస్ మీట్ ఫొటోలు...

  బాలకృష్ణ మాట్లాడుతూ...

  బాలకృష్ణ మాట్లాడుతూ...

  అన్ని తానై ఈ సినిమా తీశాడు దర్శకుడు శ్రీవాస్‌. సెట్లో కుటుంబ వాతావరణం కనిపించింది. ‘బాజీరావ్‌ మస్తానీ' లాంటి గొప్ప చిత్రం తెరకెక్కించిన ఎరోస్‌ సంస్థ తెలుగులో ‘డిక్టేటర్‌'తోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆనందాన్ని కలిగించింది.

  కొత్తగా కుర్రాడిలా కనిపిస్తున్నా..

  కొత్తగా కుర్రాడిలా కనిపిస్తున్నా..

  సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆశయంతో అహర్నిశలూ పనిచేశాం. ఈ సినిమాలో నేను కొత్తగా కుర్రాడిలా కనిపిస్తున్నానంటుంటే చాలా ఆనందంగా ఉంది అంటున్నారు బాలయ్య.

  అంజలి మన అదృష్టం

  అంజలి మన అదృష్టం

  అంజలి, సోనాల్‌ మంచి హీరోయిన్స్. అంజలికి మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి తెలుగు హీరోయిన్ మన పరిశ్రమలో ఉండడం శుభపరిణామం. తమన్‌ సంగీతం బాగుంది అన్నారు.

  చాలా గ్యాప్ తర్వాత..

  చాలా గ్యాప్ తర్వాత..

  రతి అగ్నిహోత్రితో ఎన్నో ఏళ్ల కిందట కలసి నటించా. మళ్లీ ఈ సినిమా ద్వారా ఆమెని కలుసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు బాలకృష్ణ.

  ఉపాధి కలగాలి

  ఉపాధి కలగాలి

  పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. పది మందికి ఉపాధి కలగాలి'' అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.

   శ్రీవాస్‌ చెబుతూ...

  శ్రీవాస్‌ చెబుతూ...

  ప్రతి వూర్లోనూ ‘డిక్టేటర్‌' సందడి చేస్తోంది. మాస్‌ హీరో సినిమా అంటే ఏమిటో ‘డిక్టేటర్‌' నిరూపించింది. ఇలాంటి చిత్రానికి దర్శకుడితో పాటు నిర్మాతనీ అవ్వడం సంతోషంగా ఉంది.

  అందుకే అలాంటి కథ..

  అందుకే అలాంటి కథ..

  98 సినిమాలు చేసిన హీరోతో నేను ఎలాంటి సినిమా చేయాలి అని చాలా ఆలోచించా. అప్పటికే అన్నిరకాల చిత్రాలూ చేశారు. అందరికీ అర్థమయ్యే కథతోనే ఆయన్ని కొత్తగా చూపించాలని ప్రయత్నించా అన్నారు శ్రీవాస్.

  కొత్త వాళ్లని..

  కొత్త వాళ్లని..

  బాలయ్యని కొత్తగా చూపించాలంటే కొత్త యూనిట్ కావాలి. అందుకే శ్యామ్‌.కె నాయుడు, బ్రహ్మ కడలి, తమన్‌ లాంటి సాంకేతిక నిపుణులతో పనిచేశా అన్నారు శ్రీవాస్.

  ఎన్టీఆర్ గుర్తు వచ్చారు.

  ఎన్టీఆర్ గుర్తు వచ్చారు.


  ‘‘ఎన్టీఆర్‌తో కలసి నటించలేదని బాధపడ్డా. ఆలోటు ఈ సినిమాతో తీరింది. ఈ చిత్రంలో బాలకృష్ణని చూస్తే నాకు ఎన్టీఆరే గుర్తొచ్చారు''అన్నారు సుమన్‌.

  బాలయ్యే కారణం...

  బాలయ్యే కారణం...


  ‘‘నేను తెలుగు పరిశ్రమలో ఉన్నానంటే కారణం బాలకృష్ణగారే. ‘లెజెండ్‌' తరవాత మరోసారి ఆయనతో కలసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనతో పనిచేస్తూ చాలా విషయాలు నేర్చుకొన్నాన''అంది సోనాల్‌ చౌహాన్‌.

  పాజిటివ్ సౌండ్

  పాజిటివ్ సౌండ్

  టైటిల్స్ అందరూ పెడుతూంటారు. కానీ ఓ పాజిటివ్ సౌండ్ తో ఉన్న టైటిల్స్ లెజండ్, సింహా తరహాలో డిక్టటర్ కుదరింది అన్నారు బాలయ్య.

  ఆయనొక్కరే లెజండ్

  ఆయనొక్కరే లెజండ్

  నాన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఒక్కరే నా దృష్టిలో లెజండ్. ఆయన ఆశ్వీరచనంతోనే ఇన్ని సినిమాలు చేసాను.. అన్నారు బాలయ్య.

  టెన్షన్ పడలేదు

  టెన్షన్ పడలేదు  ఈ టైటిల్ అనుకున్నప్పుడు టెన్షన్ పడలేదు. శ్రీవాస్ ని మాత్రం బాగా సినిమా వచ్చేలా చూసుకోమన్నాను.

  అద్బుతంగా..

  అద్బుతంగా..

  సినిమాటోగ్రాఫర్ ప్రతీ సీన్ ని అద్బుతంగా తన కెమెరాలో భందించారు.

  ప్రత్యేకంగా అక్కర్లేదు

  ప్రత్యేకంగా అక్కర్లేదు


  ఎడిటర్ గౌతం రాజు గారు గురించి ప్రత్యేకంగా నేను ఈ రోజు చెప్పక్కర్లేదు.

  కార్యక్రమంలో..

  కార్యక్రమంలో..

  ఈ కార్యక్రమంలో గౌతంరాజు, శ్యామ్‌.కె నాయుడు, శ్రీధర్‌ సీపాన, భాస్కరభట్ల, రఘుబాబు, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, కాశీవిశ్వనాథ్‌, జీవీ, గిరి, గుండు సుదర్శన్‌, అశోక్‌కుమార్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

  English summary
  Success meet of Balakrishna's 99th film Dictator held in Hyderabad. Dictator has hit the screens during Sankranthi and this film is jointly produced by Eros International and Sriwass under Vedhaaswa Creations banner and this movie is directed by Loukyam fame Sriwass.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X