»   » తెలుగు జాతి గర్వించేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ (ఆడియో వేడుక విశేషాలు, ఫోటోస్)

తెలుగు జాతి గర్వించేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ (ఆడియో వేడుక విశేషాలు, ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

క‌లియుగ దైవం శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత‌నున్న తిరుప‌తిలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో ఆవిష్క‌ర‌ణ సోమవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.

తిరుప‌తిలోని శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హై స్కూల్‌లో జరుగిగన ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హేమామాలిని చేతుల మీదుగా ఎన్.బి.కె నెవర్ బిఫోర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ... బాలకృష్ణ సినీ ప్రస్థానం చూస్తే చాలా ఆసక్తికరమని అన్నారు. ఈ సినిమాలో నటించడం బాలకృష్ణ పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఈ సమయంలో ఈ సినిమా తీయడం ఆనందకరమని, ఈ సినిమా చూసి, అంతకు మించిన రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు. తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠలను దిగంతాలకు వ్యాపింపజేసిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి, రాజులెందరున్నా...గౌతమీపుత్ర శాతకర్ణి ప్రత్యేకమైన వ్యక్తి అన్నారు. రాజ్యాలన్నీ ఓడించి, ఏకరాజ్యంగా దేశాన్ని ఏలిన వ్యక్తి తెలుగువాడైన, అమరావతిని రాజధాని చేసుకుని పాలించిన వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణిని స్మరించుకోవడం ఎంతైనా ముదావహమని ఆయన చెప్పారు. లెజెండ్ చిత్రం వెయ్యి రోజులు ఆడింది, గౌతమీపుత్ర శాతకర్ణి వెయ్యి రోజుల కంటే ఎంతో ఎక్కువ కాలం ఆడుతుందని అన్నారు. హేమమాలిని, బాలకృష్ణ తల్లిగా నటించడం గొప్పవిషయమని అన్నారు. ఈ సినిమాను క్రిష్ గొప్పగా తీశారని చంద్రబాబు కొనియాడారు.

హేమా మాలిని మాట్లాడుతూ..

హేమా మాలిని మాట్లాడుతూ..

'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీలో శాతకర్ణి తల్లి గౌతమి బాల పాత్ర పోషించిన హేమా మాలిని మాట్లాడుతూ....ఈ సినిమాలో మంచి పాత్ర పోషించే అవకాశం కల్పించిన ఈ చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ నటించిన 'పాండవ వనవాసం'లో తాను తొలిసారి నటించానని, అందులో చిన్న పాత్ర చేసాను, గౌతమిపుత్రశాతకర్ణిలో బాలకృష్ణ తల్లిగా నటించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుందన్నారు.

బాలయ్య మాట్లాడుతూ...

బాలయ్య మాట్లాడుతూ...

బాలకృష్ణ మాట్లాడుతూ... భారత దేశాన్ని ఏకఛత్రాధిప్యతం కింద పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి, కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఆయన జన్మించారు, అలాంటి తెలుగు వ్యక్తి గురించి మనకు సరిగ్గా తెలియకపోవడం దారుణమని అన్నారు.

చరిత్రలో నిలిచిపోతుందన్న బాలకృష్ణ

చరిత్రలో నిలిచిపోతుందన్న బాలకృష్ణ

నటుల నుంచి అద్భుతమైన నటన రాబట్టే సామర్థ్యమున్న దర్శకుడు క్రిష్ అని ఈ సందర్భంగా బాలయ్య ప్రశంసించారు. వందో సినిమా కోసం చాలా కథలు విని అంగీకరించని దశలో ఉండగా ఆయన కథ చెప్పడం, ఆ కధను తాను అంగీకరించడం జరిగిందని అన్నారు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని బాలకృష్ణ తెలిపారు. సినిమా అంటే వినోదం మాత్రమే కాదని, తెలుసుకోవాల్సిన గొప్ప విషయమని ఈ సినిమా ద్వారా నిరూపితమవుతుందని బాలకృష్ణ తెలిపారు.

నాకు కొన్ని పరిమితులున్నాయన్న బాలయ్య

నాకు కొన్ని పరిమితులున్నాయన్న బాలయ్య

నటుడికి పరిమితులు ఉంటాయని, అందరూ అంటున్నట్లు తాను అన్ని పాత్రలకు సరిపోనని, ఈ సినిమాలోని పాత్రకు తాను సరిపోతాను కాబట్టే చేస్తున్నానని బాలకృష్ణ అన్నారు. తన తల్లి దీవెనల వల్లే నటసింహం అని, ఎమ్మెల్యే అని పిలిపించుకుంటున్నానన్నారు.

పెళ్లైన తరువాత పట్టుమని పదిరోజులు కూడా నా భార్య రమ్యతో గడపలేదు

పెళ్లైన తరువాత పట్టుమని పదిరోజులు కూడా నా భార్య రమ్యతో గడపలేదు

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ....అమ్మా నా పేరు ముందు నీ పేరు వేశాను...నీ పేరు నిలబెడతాను, పెళ్లైన తరువాత పట్టుమని పదిరోజులు కూడా నా భార్య రమ్యతో గడపలేదు, మనిద్దరం గర్వపడే సినిమా తీశాను అని ఈ సందర్భంగా క్రిష్ తన తల్లి, భార్యను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.

మనకి మాత్రం చేతకావడం లేదు

మనకి మాత్రం చేతకావడం లేదు

శాతకర్ణి శాసనాలు లండన్ లో ఉన్నాయి. శాతకర్ణిని మహరాష్ట్రీయులు, తమిళులు పూజిస్తున్నారు. మనకి మాత్రం చేతకావడం లేదు. దౌర్భాగ్యం ఏంటంటే మనదగ్గర ఆయనకు సంబంధించిన ఎలాంటి చరిత్ర ఆనవాళ్లు లేవు. ఆయన గ్రీకు దేశంలో పుట్టినట్లయితే ఆయనపై ఇప్పటికే అనేక పుస్తకాలు వచ్చేవి, హాలీవుడ్లో పది సినిమాలు వచ్చేవి అని క్రిష్ చెప్పుకొచ్చారు.

ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది

ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది

ఎప్పుడో గౌతమీపుత్రి శాతకర్ణి అమరావతిని రాజధానిని చేసుకుని పాలించారు. ఇప్పుడు అదే అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇదంతా మా సినిమాకు దైవ సంకల్పంలా కలొసొచ్చింది. కోటి లింగాల నుంచి ఆరంభమైన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర కన్యాకుమారి నుంచి హిమాచలం వరకు విస్తరించింది. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది అని క్రిష్ అన్నారు.

ఒక కథే కథానాయకుడిని ఎన్నకుంటుంది, అది బాలయ్యే

ఒక కథే కథానాయకుడిని ఎన్నకుంటుంది, అది బాలయ్యే

గౌతమి పుత్ర కథ తీయాలనుకున్నపుడు ఒక అద్భుతమైన రూపం ఆవిష్కరణమైంది. ఒక కథే కథానాయకుడిని ఎన్నకుంటుంది. బాలయ్య మాత్రమే నా శాతకర్ణి ఖ్యాతిని దశదిశలా ఇనుమడించగలడు అనిని డిసైడ్ అయి. తెలుగు జాతి గర్వపడే సినిమా తీసాను, ఇదేదో టిక్కెట్ల కోసం చెబుతున్న మాట కాదు. బాలయ్య బాబు ఈ సినిమాకు ఒప్పుకున్నందుకు థాంక్స్. ఆయన ఈ సినిమా కోసం రోజుకు 14 నుండి 18 గంటలు గంటలు శ్రమించారు అని క్రిష్ తెలిపారు.

మన వారసత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది: వెంకయ్య నాయుడు

మన వారసత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది: వెంకయ్య నాయుడు

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ....ఈ కార్యక్రమానికి సీఎం వచ్చారంటే అర్ధముంది...ఆయన హీరో వియ్యంకుడు. నేను ఎందుకు వచ్చాను అని అంతా అనుకోవచ్చు, తాను సినిమాలతో సంబంధం ఉన్న సమాచార ప్రసార శాఖ మంత్రిని అందుకే వచ్చానని అన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా మన వారసత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా సినిమాను వినోదం కోసం తీస్తారు. కానీ ఈ సినిమాను చరిత్రను తెలిపే విధంగా తీయడం గొప్పవిషయమన్నారు. తెలుగు వారి కీర్తి దశదిశలా నడిపించిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు, ఆయన పేరు నిలబెట్టేలా బాలయ్య ఈ సినిమా చేస్తున్నారన్నారు.

వంద సెంటర్లలో వందరోజులు ఆడే సినిమా

వంద సెంటర్లలో వందరోజులు ఆడే సినిమా

బోయపాటి మాట్లాడుతూ... గజగజ వణికించే చలిలో వేడిపుట్టించాలన్నా, భగభగలాగే మంటలో కన్నీటి బింధువు రాల్చాలన్నా బాలయ్యకే సాధ్యం. 'చరిత్ర నెలకొల్పాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్నా మేమే' అని లెజెండ్ సినిమాతో నిరూపించారు. అమరావతి ఘన చరిత్ర ప్రతి తెలుగు వాడికీ తెలియాలని గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నారు. ఇది అంతా వందో సినిమా అంటున్నారు. కానీ ఇది వందో సినిమా కాదని, వంద సెంటర్లలో వందరోజులు ఆడే సినిమా అన్నారు. .

బాలయ్య ర‌గులుతున్న కాగ‌డా లాంటివాడు

బాలయ్య ర‌గులుతున్న కాగ‌డా లాంటివాడు

ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ... బాల‌కృష్ణ సినిమాకి మాట‌లు రాయడం త‌న‌ క‌ల అని సాయి మాధ‌వ్ అన్నారు. బాలయ్య ర‌గులుతున్న కాగ‌డా లాంటి వాడని, అలాంటి బాలయ్యకు మాట‌లు రాయ‌డమంటే మాట‌లా?... ఆ అవ‌కాశం త‌న‌కే ద‌క్కింది, ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బాలయ్య 99 సినిమాలు చేసారు...ఆలాంటి హీరోకి నేను రాసే డైలాగులు న‌చ్చుతాయా? లేవా? అని టెన్షన్ పడ్డాను, ఆయన్ను మెప్పించడానికి త‌న‌ను తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశాన‌ని అన్నారు. .బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేషన్లో వస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా అద్భుతంగా ఉంటుందన్నారు.

బాలయ్య ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తాడు

బాలయ్య ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తాడు

దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ... నేను ఎక్కడికెళ్లినా అందూరూ 'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ బాగుందని అంటున్నారు. ఈ మాట ముఖస్తుతి కోసం చెప్పడం లేదు, బాలయ్య ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తాడు, ఈ సినిమా వందేళ్లు గుర్తుంటుందని, ఈ రోజుల్లో ఊహలో లేని వంద రోజులు ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సినిమా వల్ల తెలుగు వారిలో నిద్రాణమైఉన్న జాతి భక్తి జాగ్రుతమవుతుంది

ఈ సినిమా వల్ల తెలుగు వారిలో నిద్రాణమైఉన్న జాతి భక్తి జాగ్రుతమవుతుంది

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ...శాతవాహనులు పాలించిన 400 సంవత్సరాల్లో 25వ చక్రవర్తి 'గౌతమీపుత్ర శాతకర్ణి', 32 మంది రాజులను జయించి, వారి ఖడ్గాలను సొంతం చేసుకుని, శాంతి ఖడ్గంగా మార్చిన గొప్ప చక్రవర్తి 'గౌతమీపుత్రి శాతకర్ణి', తెలుగుజాతి గర్వించదగ్గ గొప్ప చక్రవర్తి. ఇలాంటి గొప్ప రాజు చరిత్రను దర్శకుడు క్రిష్ చిత్రీకరించిన విధానం అద్భుతం. ఈ సినిమా వల్ల తెలుగు వారిలో నిద్రాణమైఉన్న జాతి భక్తి జాగ్రుతమవుతుందన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో రిస్క్ తీసుకుని క్రిష్ ను నమ్మి ఈ ప్రాజెక్టు అప్పగించిన నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారు. ఈ సినిమా తీయగల ధైర్యం క్రిష్ కు మాత్రమే ఉందని, అలాగే ఈ పాత్రను చేయగల ధైర్యం బాలయ్యకు మాత్రమే ఉందని ఆయన అన్నారు.

English summary
Nandamuri Balakrishna acted Krish directed Goutamiputra Satakarni Movie audio launch held at Nehru Municipal High School Grounds, Near SVIMS Hospital, Tirupati today (26th Dec) evening. AP CM Chandra Babu Naidu released the audio CD and handed over the first CD to Union Minister Venkaiah Naidu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu