twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రపంచంలో ఆయనొక్కడే (లెజెండ్ ఆడియో వేడుక ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న 'లెజెండ్'చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఘనంగా జరిగింది.

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన సీడీలను శ్రీను వైట్ల విడుదల చేసి తొలి ప్రతిని బి.గోపాల్‌కు అందించగా, పాటలను అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయించారు. దర్శకుడు రాజమౌళి 'లెజెండ్' చిత్రం థియేటర్రికల్ ట్రైలర్ విడుదల చేసారు.

    ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, ఎవరెవరు ఏం మాట్లాడారు అనే పూర్తి వివరాలు స్లైడ్ షోలో....

    ఆయన ఒక్కడే లెజెండ్ అన్న బాలయ్య

    ఆయన ఒక్కడే లెజెండ్ అన్న బాలయ్య

    తెలుగు చిత్ర పరిశ్రమలో, ఈ దేశం, ఈ ప్రపంచంలో నాకు సంబంధించిన వరకు లెజెండ్ అంటే నందమూరి తారక రామారావు గారు ఒక్కరే అని బాలయ్య చెప్పుకొచ్చారు. నా వరకు ఆయన తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేసారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారాయన. అందరికీ అన్నీ చేసారు. అభివన భరీగథుడు ఆయన అన్నారు.

    అభిమానులు తీరు చూసి చలిపోయా

    అభిమానులు తీరు చూసి చలిపోయా

    బాలకృష్ణ గారికి ఒకసారి షూటింగ్ సమయంలో జలుబు చేస్తే ఆసుపత్రికి వెళ్లాం. అయితే అది యాక్సిండెంట్ అని ప్రచారం జరిగింది. అపుడు నాకు అభిమానులు ఫోన్ చేసిన తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఆయన పట్ల ఉన్న అభిమానం చూసి చలించి పోయాను అన్నారు దర్శకుడు బయపాటి శ్రీను.

    నాకు అర్హత లేదన్న శ్రీను వైట్ల

    నాకు అర్హత లేదన్న శ్రీను వైట్ల

    దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ...బాలయ్య బాబు గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. నేను సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాలయ్య బాబు గారి సినిమాకు పని చేసాను. ఆయన మీదే ఫస్ట్ క్లాప్ కొట్టాను. ఆ నెంబర్ నాకు ఇంకా గుర్తుంది. డీఎస్పీలో మంచి ఎనర్జీ ఉంటుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాతో ఇంకా పీక్‌కి వెళ్తారని భావిస్తున్నాను అన్నారు.

    బాలయ్య నట విశ్వరూపం

    బాలయ్య నట విశ్వరూపం

    బ్రహ్మనాందం మాట్లాడుతూ ఈ చిత్ంరలో బాలయ్య నటవిశ్వరరూపం చూపించారు. అన్ని రకాల హంగులు సమకూరిన సినిమా ఇది. ఆంధ్రుల అభిమాన అందాల నటుడు జగపతిబాబు ఇందులో విలన్‌గా నటించారు. ఈ సినిమాకు తిరుగులేదు అన్నారు.

    బాలయ్య న్యూక్లియర్ రియాక్టర్

    బాలయ్య న్యూక్లియర్ రియాక్టర్

    జగపతి బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు బాలయ్య యాక్టర్ అనుకున్నాను. కానీ ఆయన న్యూక్లియర్ రియాక్టర్ అని నాకు ఇపుడు అర్థమైంది అన్నారు.

     బాలయ్య అల్లుళ్లు

    బాలయ్య అల్లుళ్లు

    ‘లెజెండ్' ఆడియో వేడుకకు బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకష్ తో పాటు, చిన్నల్లుడు శ్రీభరత్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

    దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...

    దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...

    బాలయ్య బాబుగారితో మాట్లాడుతుంటే చిన్నపిల్లాడితో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఎనర్జీని మర్చిపోలేను. వజ్రోత్సవం టైంలో ఆయన్ను చూసినప్పటి నుండి నా మనసులో ఈ భావన ఉండి పోయింది. లెజెండ్ నాకు స్పెషల్ సినిమా అన్నారు.

    గుండెల మీద చేయి వేసుకుని చూడండి

    గుండెల మీద చేయి వేసుకుని చూడండి

    సినిమాపై అంచనాలు పెంచుకున్నామని చాలా మంది చెబుతున్నారు. ‘సింహా' మైల్ స్టోన్. దాంతో కంపేర్ చేయొద్దు. ఈ సినిమా గుండెల మీద చేయేసుకుని చూడండి. లెజెండ్ పొలిటికల్ సినిమానో, ఫ్యాక్షన్ సినిమానో కాదు. అన్నీ కలగలిపిన సినిమా. ప్యామిలీతో వెళ్లి హ్యాపీగా చూడొచ్చు. అన్ని సినిమాల్లోకెల్లా లెజెండ్ గొప్పగా ఉండాలని ట్రై చేసాం. ముందంజలోనే ఉంటాం. నా ప్రయత్నలోపం ఎక్కడా లేదు. ముందు ఈ సినిమా కోసం చాలా మంది విలన్లను వెతికాం. చివరకు అనిల్ అనే స్నేహితుడి సలహా మేరకు జగపతి బాబును సంప్రదించాం. లెజెండ్ కోసం బాలయ్య, జగపతి బాబు రెండు సినిమాలు వదులుకున్నారు.

    దేవిశ్రీ ప్రసాద్ గురించి బాలయ్య

    దేవిశ్రీ ప్రసాద్ గురించి బాలయ్య

    దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలు ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి చాలా బాగా రాసారు. సినిమా సక్సెస్‌కు ఆడియో దోహదపడుతుంది. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్ల నాన్న పేురు నిలబెట్టాడు దేవిశ్రీ ప్రసాద్.

    జగపతి బాబు గురించి బాలయ్య

    జగపతి బాబు గురించి బాలయ్య

    జగపతి బాబు బోర్న్ ఆర్టిస్ట్. ఆయనలోని నటనా కౌశలాన్ని చూపగలిగిన పాత్ర ఈ సినిమాలో చేసారు. ఆ పాత్రను నేను విలన్ అని అనను. నేను కూడా గతంలో ఒక సినిమాలో నెగెటివ్ షేడ్ పాత్ర చేసాను అన్నారు బాలకృష్ణ

    అనిల్ సుంకర మాట్లాడుతూ...

    అనిల్ సుంకర మాట్లాడుతూ...

    ఈ సదవకాశాన్ని మాకిచ్చిన బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి ధన్యవాదాలు. ‘సింహా' కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కోసం చాలా మంది ప్రయత్నించినా, మమ్మల్ని నమ్మి మాకు అవకాశాన్ని ఇచ్చారు. మార్చి 28వ సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు.

    జగపతి కోసం 56 డ్రెస్సులు, 9 గెటప్పులు

    జగపతి కోసం 56 డ్రెస్సులు, 9 గెటప్పులు

    జగపతి బాబును విలన్ గా సెలక్ట్ చేసిన తర్వాత 56 డ్రెస్సులు, 9 గెటప్పులు చెక్ చేసాం....కొన్ని రోజుల పాటు కేవలం ఆయన గెటప్ గురించే కష్టపడ్డా అన్నారు బోయపాటి శ్రీను.

    రాజమౌళి మాట్లాడుతూ..

    రాజమౌళి మాట్లాడుతూ..

    ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ‌గా మిగిలి పోవాలి అన్నారు.

    బాలయ్య, శ్రీను హెల్ప్ చేసారు

    బాలయ్య, శ్రీను హెల్ప్ చేసారు

    ఎన్నో సినిమాల్లో హీరోగా చేసిన నన్ను ఈ సినిమాకు విలన్‌గా బోయపాటి శ్రీను సెలక్ట్ చేసుకున్నారు. వంద సినిమాల్లో చేసి వెంటనే విలన్‌గా మారడం కష్టం. నాకు శీను, బాలయ్య బాబు హెల్ప్ చేసారు అన్నారు.

    English summary
    The audio and trailer of Nandamuri Balakrishna's big budget entertainer "Legend" was launched at an event held in Hyderabad's Shilpa Kala Vedhika on 7 March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X