twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ నియంత కథ ( 'లెజెండ్‌'ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలకృష్ణ సినిమాలలో సింహా కు ప్రత్యేక స్ధానం. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు సూపర్ హిట్ ఇచ్చి ఆయన పవరేంటో చూపిన చిత్రం అది. దాంతో మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. దానికి తోడు బాలకృష్ణ ఫస్ట్ లుక్,టీజర్ కు కూడా ఆ అంచనాలను పెంచేసాయి. వీటికి తోడు తొలుసారిగా జగపతిబాబు ఇందులో కీలకమైన పాత్రలో విలన్ గా కనిపించటం కూడా మరింత ఆసక్తి రేపే అంశం. ఇవన్నీ ఎలా ఉన్నా ఎన్నికలతో వేడిక్కిన వాతావరణం కావటంతో చిత్రం ఏ మాత్రం బాగా ఉందని టాక్ వచ్చినా పెద్ద హిట్టయ్యే అవకాసం ఉంది.

    జయ్‌దేవ్‌ (బాలకృష్ణ) వ్యక్తిత్వపరంగా నియంతలాంటివాడు. నియంత అంటే ఎప్పుడూ అధికారం గురించి ఆలోచిస్తాడు. కానీ జయ్‌దేవ్‌ మాత్రం ప్రజల కోసం ఆలోచిస్తాడు. సమాజం తరవాతే ఏదైనా. తనను నమ్ముకొన్నవాళ్లకు అన్యాయం జరిగితే సహించడు. దీంతో పాటు కుటుంబం అంటే ప్రాణం. తన క్రమశిక్షణ వల్ల ఏం సాధించాడు? ఏం కోల్పోయాడు? అసలు ఈ ప్రయాణంలో లెజెండ్‌గా ఎలా ఎదిగాడు? అన్నదే ఈ చిత్రకథ. జితేందర్‌ (జగపతిబాబు)తో ఆయనకున్న పగ ఏమిటన్నదీ ఆసక్తికరమే.

    దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ... ''కుటుంబ బంధాలకు ప్రాధాన్యమిచ్చిన కథ ఇది. ఓ సున్నితమైన ప్రేమకథనూ మిళితం చేశాం. వీటి మధ్య ఓ వ్యక్తి లెజెండ్‌గా ఎదిగిన విధానం చూపిస్తున్నాం. 'సింహా' తరవాత మా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి ఎన్ని అంచనాలుంటాయో తెలుసు. అయితే 'సింహా'కీ ఈ సినిమాకీ పోలిక లేదు. బాలయ్య గెటప్‌ నుంచి, ఆయన మాటతీరు, కథ, కథనాలు.. ఇవన్నీ కొత్త తరహాలో సాగుతాయి. బాలకృష్ణ వస్త్రధారణ ఇంగ్లిష్‌ లుక్‌ని పోలి ఉంటుంది. జగపతిబాబు గెటప్‌.. ఇటాలియన్‌ స్త్టెల్‌లో తీర్చిదిద్దాం. వారిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు, పోరాట ఘట్టాలు, పాటలు, సంభాషణలు ఇవన్నీ బాలకృష్ణ అభిమానుల్ని అలరిస్తాయి'' అన్నారు.

    Balakrishna's Legend preview

    చిత్రం: లెజెండ్‌
    సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలనచిత్రం
    నటీనటులు: నందమూరి బాలకృష్ణ, జగపతిబాబు, సోనాల్‌ చౌహాన్‌, రాధికా ఆప్టే, సితార, రావు రమేష్‌, ఈశ్వరీరావు తదితరులు
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
    పాటలు:రామ జోగయ్య శాస్త్రి
    మాటలు: ఎం. రత్నం
    ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్
    యాక్షన్: రామ్-లక్ష్మణ్,కనల్ కణ్ణన్
    ఆర్ట్: ఏయస్ ప్రకాష్
    ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
    నిర్మాతలు: అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట,
    సమర్పణ: సాయి కొర్రపాటి
    విడుదల: 28, మార్చి 2014(శుక్రవారం).

    English summary
    Now Balakrishna's film Legend is gearing up for grand worldwide release this Friday. Bala Krishna who will be seen in stylish royal look in the movie is playing dual roles pairing up with Radhika Apte and Sonal Chauhan.It should be seen whether the film will impress the film goers and set new collection records at the Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X