»   » జోక్ ఆఫ్ ది సీజన్: అమెరికాలో 40 థియేటర్లలో బాలయ్య 'సింహా'

జోక్ ఆఫ్ ది సీజన్: అమెరికాలో 40 థియేటర్లలో బాలయ్య 'సింహా'

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి అందగాడు బాలకృష్ణ ఓ హిట్ కోసం చకోర పక్షిగా ఎదురుచూస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయం పొందుతున్నా ఆయనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ ఇది మన రాష్ట్రం వరకూ మాత్రమే. అమెరికాలో ఆయన సినిమాలకు చాలా దారుణమయిన మార్కెట్ వుంది. ఇంత వరకూ బాలయ్య నటించిన ఏ సినిమా కూడా అమెరికాలో 10 లక్షలకు మించి వసూలు చెయ్యలేదు. కానీ ఆయన నటించిన సింహా సినిమా మాత్రం అక్కడ దాదాపు 40 థియేటర్లలో విడుదల అవుతోందని ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు పొందిన సుప్రీం సంస్థ వారు ప్రకటించారు. దీంతో ఫిల్మ్ నగర్ లో ఈ వార్త మీద పెద్ద చర్చే జరుగుతోంది.

ఇంతవరకూ బాలయ్య ఏ సినిమా కూడా 10 లక్షలకు మించి వసూలు చెయ్యలేదు. కానీ 25 ప్రింట్లు తీయడానికి 18 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. మరి రవాణా ఖర్చులు ట్యాక్సులు ఇవన్నీ కలిపితే తడిసి పోమెడవుతుంది. మరి ఏ దైర్యంతో సుప్రీం వారు ఈ సినిమాను 40 థియేటర్లలో విడుదల చేస్తున్నారను అని అందరూ చర్చించుకుంటున్నారు. మరికొందరయితే ఈ సినిమాకు ఇక్కడ హైప్ క్రియేట్ చెయ్యడానికే ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారు. ఇదో పెద్ద జోక్ లాగా వుంది. ఈ సీజన్ కే ఇదో పెద్ద జోక్ అని వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X